- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

చినుకు చినుకు గాలి వాన లాగా మారుతుంది సంధ్య థియేటర్ ఘటన .. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ విషయం పై నిప్పులు చేరగ‌టం .. దానికి ప్రతిగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ఒక దానివంట ఒకటి జరిగిపోయాయి .. ఈ వ్యవహారం అక్కడి తో ఆగేలా కనిపించడం లేదు .. మంత్రులు పోలీస్ అధికారులు రంగంలోకి దిగిపోయారు .. ఒకరికి ఒకరు హెచ్చరికలు తీవ్రంగా మారాయి .. ఇప్పుడు ఇదంతా కలిసి ఇండస్ట్రీ మీద ప్రభావం చూపించాలా కనిపిస్తుంది. ఇప్పుడు మిగిలింది సంధి చేయడమే ..


రెండు పక్కల మాట్లాడగలిగే వాళ్ళు కావాలి ఇక అల్లు అర్జున్ నుంచి ఎలాగూ దీనిపై ప్రతి స్పందన పెద్దగా ఉండదు .. కానీ ప్రభుత్వం వైపు నుంచి సంధి కుదుర్చాలి.. ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవాలి .. లేదంటే భవిష్యత్తులో తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌కు కష్టాలు తప్పవు .. వచ్చే సంక్రాంతి కి పెద్ద సినిమాలు ఎన్నో ఉన్నాయి .. వాటికి థియేటర్లు రన్ కావాలి .. ఇంకా చాలా చాలా ఇలాంటివి ఉన్నాయి .. ఇవన్నీ జరగాలంటే ప్రభుత్వం ఆగ్రహాన్ని చల్లార్చాలి . ఇలాంటి పని చేయాలంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వల్లే సాధ్యమవుతుంది ..


సురేష్ బాబు , అశ్విని దత్ , చిరంజీవి లాంటి పెద్దలు రంగలోకి దిగాల్సి ఉంటుంది .. ఈ వ్యవహారం కోర్టు కు వదిలేసేలా ఒప్పించాల్సి ఉంటుంది .. ఇప్పుడు ఈ పనికి పోనుకోవడానికి చిరంజీవి  ముందుకు వస్తారా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది . ఎందుకంటే అల్లు అర్జున్ చాలా కాలంగా మెగా కుటుంబం నుంచి బయటకు వచ్చి .. అల్లు అనే దాన్నే ట్రెండింగ్ చేసే పనిలో ఉన్నాడు .. దీని కారణంగా ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: