అయితే రెండవ భాగానికి సంబంధించి త్వరలోనే షూటింగ్ కూడా మొదలు కాబోతోందట. హోమ్ భలే ఫిలిమ్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రంలో శృతిహాసన్ ప్రభాస్ కి జోడిగా నటించింది. సలార్ సినిమా విడుదలై ఈరోజుకి ఏడాది పూర్తి కావడం చేత డైరెక్టర్ ప్రశాంత్ నిల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.. సలార్ ఫలితంతో తాను సంతోషంగా లేనని ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కోసం ఎంతో కష్టపడ్డాను కానీ ఎక్కడో కేజిఎఫ్-2 చిత్రానికి సంబంధించి ఛాయలు కనిపించాయని తెలిపారు.
కానీ సలార్-2 సినిమాను మాత్రం తన కెరీర్ లోనే ఒక బెస్ట్ మూవీ గా తీయబోతున్నానంటూ తెలిపారు. తాను ఇందులో పెట్టిన రచన బహుశా తన కెరీర్లు ఇప్పటి వరకు రచించిన రచనల్లో చాలా స్పెషల్ గా ఉంటుందని తెలిపారు.. ప్రేక్షకులు ఊహించని దానికంటే ఎక్కువగానే ఉంటుంది అంటూ తెలిపారు ప్రశాంత్ నిల్. ప్రశాంత్ నీల్ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉండడంతో అభిమానులు ఫుల్ ఖుషిఅవుతున్నారు.. మరి మొత్తానికి ఈ సినిమాకు కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.