ఈ ఫోటోలు చూసిన అభిమానులు జాన్వీ కపూర్ చాలా క్యూట్‌గా అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ ఎలాంటి ఫోటోషూట్ షేర్ చేసినా కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు వచ్చిపడతాయి. అలాగే క్రిస్మస్ స్పెషల్ ఫోటోషూట్‌కు కూడా తెగ లైకులు వస్తున్నాయి. ఇక ఈ గ్లామరస్ హీరోయిన్ ఇటీవల దేవర సినిమాలో నటించింది. ఈమె దేవర సినిమాలో కొద్ది సమయం మాత్రమే కనిపించింది. కేవలం తన చిన్ననాటి రోల్ మాత్రమే కనిపిస్తుంది. కంప్లీట్ గా జాన్వీ ఎంటర్ అయ్యేది సినిమా సెకండాఫ్ లో మాత్రమే.. అయితే జాన్వీ కపూర్ కి ముందు చెప్పినట్టే పెద్దగా సినిమాలో స్కోప్ లేకుండా పోయింది. కేవలం పాటలు సినిమాలో ఉన్న సీన్స్ కూడా కొన్నే ఉండడంతో ఈమె పెద్దగా కనిపించలేదు. అయినప్పటికీ జాన్వీ కపూర్ తన అందాలతో యువతలో క్రాజ్ ని మాత్రం పెంచుకుంది.
కాగా దేవర పార్ట్ 2 సినిమాలో జాన్వీ రోల్ అదిరిపోతోంది అని కొరటాల శివ చెప్పడం జరిగింది. అటు గ్లామర్ తో పాటు ఇటు పెర్ఫామెన్స్ తో జాన్వి పార్ట్ 2 లో కనిపిస్తుందని సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ తో కలిపి జాన్వీ రోల్ కూడా ఫుల్ లెంగ్త్ లో కనిపిస్తుంది అని తెలిపారు. సో మొత్తానికి పార్ట్ 2 లో అయితే జాన్వీ కపూర్ రోల్ మామూలుగా ఉండదని తెలుస్తుంది.