అయితే, ఈ విషయం గురించి సినీ నటుడు జగపతి బాబు రియాక్ట్ అయ్యారు. తన సోషల్‌మీడియా ద్వారా ఒక వీడియోను విడుదల చేశారు. 'సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక నేను ఊరి నుంచి రాగానే.. వెంటనే ఆసుపత్రికి వెళ్లాను. సంధ్య థియేటర్ ఘటనలో నష్టపోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించాను. హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స పొందుతున్న బాలుడిని చూశాను. కష్ట సమయంలో శ్రీతేజ తండ్రి, సోదరిని పలకరించాలని అనిపించి అక్కడకు వెళ్లా. అందరి ఆశీస్సులతో త్వరగానే బాబు కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చా. ఈ ఘటనలో అందరికంటే ఎక్కువగా కోల్పోయింది రేవతి కుటుంబం కాబట్టి నా వంతు సపోర్ట్ ఇద్దామని వెళ్లాను. అయితే, మానవత్వంతో మాత్రమే వెళ్లాను. దానికి పబ్లిసిటీ చేయలేదు. దీంతో ఆ విషయం ఎవరికీ తెలియదు. ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలని చెబుతున్నాను.' అని జగపతి బాబు తెలిపారు.
ఇక ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా కేసు నమోదైంది. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఆయనను కలవడానికి చాలా మంది వచ్చి వెళ్లడం జరిగింది.