టాలీవుడ్ సినీ పరిశ్రమకు పుష్ప 2 సినిమా పెద్ద దెబ్బ పడేలా కనిపిస్తోంది. ఈ సినిమా ప్రీమియర్ షోలో భాగంగా జరిగిన తొక్కేసలాటలో భాగంగా ఒక మహిళ మరణించడంతో ఆమె కొడుకు కూడా ప్రస్తుతం చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నారు. ఈ విషయంపైన అల్లు అర్జున్ అరెస్టు చేసి జైల్లో కూడా ఉన్నారు. అయితే గతంలో ఎన్నడు లేని విధంగా ఇలా ఇండస్ట్రీలో ఒకదాని తర్వాత మరొకటి జరుగుతూ ఉండడంతో ఈ వివాదం రోజురోజుకి ముదురుతూ ఉండడంతో చివరికి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా అల్లు అర్జున్ ప్రస్తావనను తీసుకురావడం జరిగింది. వీటికి తోడు సినిమాలకు సంబంధించి బెన్ఫిట్ షోలు ,టికెట్ ధరలు పెంచేందుకు ఎక్కడ అనుమతి ఉండదనే విధంగా తెలియజేశారు.


అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ,అల్లు అర్జున్ పైన ఫైర్ అవుతూ ఇలా చెప్పినప్పటికీ.. నష్టం మాత్రం దిల్ రాజ్ కే పడుతోందట. ఎందుకంటే ఆయన నుంచి తర్వాత మూడు చిత్రాలు సంక్రాంతికి థియేటర్లో విడుదల కాబోతున్నాయి. ఇందులో ఒక పాన్ ఇండియా చిత్రం కూడా ఉన్నది. ఇలాంటి సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసిన ప్రకటన దిల్ రాజ్ కు ఊహించని ఒక ఎదురు దెబ్బగా మారనుందట.. దిల్ రాజ్ కెరియర్ లోనే ఇప్పటివరకు తెరకెక్కించిన ఒక భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ సినిమా గేమ్ ఛేంజర్ తెరకెక్కించారు. ఈ సినిమా జనవరి 10న రిలీజ్ కాబోతున్నది.


డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుమారుగా రూ.250 కోట్లకు పైగా పెట్టినట్లుగా సమాచారం.. అంటే థియేట్రికల్ బిజినెస్ కనీసం రూ.500 కోట్లకు పైగా బిజినెస్ జరగాల్సి ఉంటుంది. అంత భారీ మొత్తంలో కలెక్షన్స్ రాబట్టాలి అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అయితే కచ్చితంగా సాధ్యం కాదు.. ఎందుకంటే ఈ సినిమా ఒక్కటే సంక్రాంతికి రిలీజ్ కాలేదు.. గేమ్ ఛేంజర్ తో పాటుగా వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నం, బాలయ్య నటిస్తున్న డాకు మహారాజు వంటి చిత్రాలను నైజాంలో దిల్ రాజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారట. ఈ మూడు చిత్రాలతో భారీ లాభాలు పొందాలనుకున్నప్పటికీ తెలంగాణ సీఎం బెనిఫిట్ షోలు ,టికెట్ల రేటు పెంపును ఆపివేయడంతో కచ్చితంగా దిల్ రాజుకు భారీ దెబ్బ పడేటట్లు కనిపిస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: