మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి శ్రద్ధ శ్రీనాథ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన జెర్సీ అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది . ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలో శ్రద్ధ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది . ఈ మూవీ లో ఒక పిల్లాడికి తల్లి పాత్రలో నటించిన ఈమె నటినకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి.

ఇక ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఈమెకు వరుస పెట్టి క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కుతాయి , ఈమె స్టార్ హీరోయిన్ స్థాయికి వెళుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈమెకు జెర్సీ సినిమా తర్వాత ఆ స్థాయి అవకాశాలు రాలేదు. ఇక జెర్సీ మూవీ తర్వాత కెరియర్లో కాస్త ఆప్ అండ్ డౌన్స్ ఎదుర్కొన్న ఈ బ్యూటీ కి ఈ సంవత్సరం మంచి అవకాశాలు దక్కాయి. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఈమె నటించిన సైంధవ్ సినిమా విడుదల అయింది. విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ సినిమాలోని ఈమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సంవత్సరం ఈ బ్యూటీ నటించిన మెకానిక్ రాఖీ సినిమా కూడా విడుదల అయింది. ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో ఈ బ్యూటీ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇలా జెర్సీ మూవీ తర్వాత ఈ సంవత్సరం ఈ బ్యూటీ కి బాగా కలిసి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: