క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఐకన్ స్టార్ అల్లు అర్జున్ కి మద్దత్తు తెలుపుతున్నాయి. ఆ పార్టీల నేతలు మొదటి నుంచి అల్లు అర్జున్కే సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కూడా కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ బన్నీకే మద్దత్తు ఇచ్చారు. నేషనల్ అవార్డు వచ్చిన హీరోపై రాష్ట్ర సర్కారు కక్ష కట్టిందని బీజేపీ నేతలు ఆరోపించారు. అలాగే కేవలం సీఎం పేరు మర్చిపోయినందుకే ఇలా చేస్తున్నదని బీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు.
బీజేపీ రాష్ట్ర నేతలతోపాటు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, బీజేపీ ఎంపీ, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్, ప్రముఖ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సైతం అల్లు అర్జున్కు సపోర్ట్గా నిలిచారు. అల్లు అర్జున్కు తాను బిగ్ సపోర్ట్ అని, ఆయన అరెస్ట్ అవడం దురదృష్టకరమని కంగనా రనౌత్ తెలిపారు. సినిమా ఇండస్ట్రీపై కాంగ్రెస్ కు గౌరవం లేదుని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. సీఎం పేరు మరిచిపోవడమే ఆయన చేసిన తప్పా. సీఎం పేరు మరిచిపోయినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా? అని కేటీఆర్ ప్రశ్నించారు, అలాగే తన సప్పోర్ట్ కూడా తెలిపారు.  
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో దాదాపు సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టుగా పోస్టులు కనిపిస్తున్నాయి. అదే సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ తీరుపై నెటిజన్లు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ తేజ్ కన్న తల్లిని పోగొట్టుకున్నాడని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఒక్కరైనా సహాయం చేశారా.. పోనీ వెళ్లి చూశారా అంటూ జనాలు మండిపడుతున్నారు. కాగా, ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదలైంది. ఆ రోజు క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన గురించి అందరికి తెలిసిందే. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: