సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది దర్శకులు ఒక్కో సినిమాను ఒక్కో నిర్మాణ సంస్థలో చేస్తూ వస్తూ ఉంటారు . ఇక మరి కొంత మంది దర్శకులు మాత్రం తమ కెరియర్లో ఎక్కువ సినిమాలను ఒకే బ్యానర్లో చేస్తూ ఉంటారు . అలాగే నిర్మాణ సంస్థలను మార్చకుండా ఒకే నిర్మాణ సంస్థలలో సినిమాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా తెలుగు సినీ పరిశ్రమలో కూడా కొంత మంది దర్శకులు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ కెరియర్ లో ఎక్కువ సినిమాలను ఒకే నిర్మాణ సంస్థల్లో చేస్తూ వస్తున్నారు.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ "జులాయి" సినిమా దగ్గర నుండి ఆయన ఆఖరుగా దర్శకత్వం వహించిన గుంటూరు కారం సినిమా వరకు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న సుకుమార్ 2018 వ సంవత్సరం విడుదల అయిన రంగస్థలం సినిమాను మైత్రి సంస్థలో నిర్మించాడు. ఆ తర్వాత ఆయన పుష్ప పార్ట్ 1 , పుష్ప పార్ట్ 2 సినిమాలను కూడా ఇదే బ్యానర్లో రూపొందించాడు. ఇకపోతే సుకుమార్ తన తదుపరి మూవీ ని రామ్ చరణ్ తో చేయబోతున్నాడు. ఈ సినిమాను కూడా మైత్రి సంస్థ లోనే చేయనున్నాడు.

ఇకపోతే తెలుగు లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న అనిల్ రావిపూడి వరుస పెట్టి దిల్ రాజు బ్యానర్ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో సినిమాలను నిర్మిస్తున్నాడు. వంశీ పైడిపల్లి కూడా వరుస పెట్టి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లోనే సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఇలా ఈ దర్శకులు ఎక్కువ శాతం ఒకే బ్యానర్లో సినిమాలను చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: