నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం డాకు మహారాజ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటి మణులు అయినటువంటి ఊర్వశి రౌటేలా , శ్రద్ధ శ్రీనాథ్ , ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా ... టాలెంటెడ్ డైరెక్టర్ బాబి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.

మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి ఈ మూవీ బృందం వారు అనేక ప్రచార చిత్రాలను విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ కేజీ న్యూస్ వైరల్ గా మారింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో ఫ్యామిలీ ఎమోషన్స్ సన్నివేశాలు అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో యాక్షన్ సన్నివేశాలు భారీ ఎత్తున ఉంటాయి అని ఈ మూవీ ప్రచార చిత్రాలు చూసిన ప్రేక్షకులు భావించారు.

కానీ ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కంటే కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ సన్నివేశాలు అద్భుతంగా వచ్చినట్లు , అవి ప్రేక్షకులను భారీగా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్స్ సన్నివేశాలు ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటాయి అని , ఆ సన్నివేశాల ద్వారానే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: