వేణు స్వామి.. ఈయన వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. ఎంతోమంది సెలబ్రిటీల జీవితాల గురించి అడగకుండానే వారి జాతకాలు చెబుతూ వారి అభిమానుల చేత కుటుంబ సభ్యులచేత తిట్టించుకుంటున్న ఆస్ట్రాలజర్. ఇప్పటికే ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్న వేణు స్వామి గత కొద్ది రోజుల నుండి ఇక జాతకాలు చెప్పను అంటూ ఇండస్ట్రీకి దూరంగా ఉంటానని చెప్పారు. కానీ సడన్గా అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా విడుదలయ్యాక మళ్లీ వైరల్ అవుతున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ పుష్ప టు సినిమా విడుదలైన రోజు జరిగిన వివాదంలో అరెస్టయ్యారు.దాంతో ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో వేణు స్వామి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అరెస్టు ని ఇప్పటికే ఎంతోమంది తప్పు పట్టారు.అలాగే జైలుకు వెళ్ళిన వాళ్ళందరూ సీఎంలు అవుతారు. 

అలాగే అల్లు అర్జున్ కూడా 100% సీఎం అయ్యే ఛాన్స్ ఉంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అయితే ఈయన వ్యాఖ్యలను అల్లు ఫాన్స్ స్వాగతించారు. ఇదిలా ఉంటే గతంలో వేణు స్వామి అల్లు అర్జున్ కి దాదాపు 15 ఏళ్ల పాటు రాజయోగం ఉందని, ఈ 15 సంవత్సరాల పాటు అల్లు అర్జున్సినిమా చేసినా అది బ్లాక్ బస్టర్ హిట్ అని అల్లు అర్జున్ నిర్మాతలకు బంగారు బాతు.. ఆయనపై డబ్బులు పెట్టుబడిగా పెడితే అంతకంటే రెట్టింపు లాభాలు వస్తాయి అంటూ అల్లు అర్జున్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే అప్పటి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవ్వడంతో ప్రస్తుతం కొంతమంది హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియా జనాలు వేణుస్వామి పై ట్రోల్స్ చేస్తున్నారు..

అల్లు అర్జున్ కి 15 ఏళ్ల రాజయోగం ఉంటుంది అని వేణు స్వామి చెప్పారు  రాజయోగం అంటే ఇదేనా..విమర్శల పాలు వివాదాల పాలు అవ్వడమేనా.. ప్రస్తుతం దేశం మొత్తం అల్లు అర్జున్ వివాదమే నడుస్తోంది.ఇదే నా రాజయోగం అంటే అంటూ కొంతమంది నెటిజన్స్ వేణు స్వామి పై ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాదు ఇప్పటికైనా జాతకాలు చెప్పడం మానేసుకో ఇంకొకసారి రాజయోగం ఉంది వాళ్ల సినిమాలు ఫ్లాఫ్ అవుతాయి వీళ్ళ సినిమాలు హిట్ అవుతాయి అంటూ సోది కబుర్లు చెబితే బాగుండదు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.అలా అల్లు అర్జున్ వివాదంలో ఇరుక్కోవడంతో వేణు స్వామి కూడా అడ్డంగా బుక్ అయ్యాడు

మరింత సమాచారం తెలుసుకోండి: