యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్ అయిపోయాడు. ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా కోట్లాది మంది సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ కెరియర్లో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా మిస్టర్ పర్ఫెక్ట్. దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాకు దశరథ్ దర్శకత్వం వహించారు. కాజల్ అగర్వాల్ - తాప్సి హీరోయిన్లుగా నటించారు. తాప్సి కెరీయర్ లో కూడా ఇది మంచి హిట్ సినిమాగా నిలిచింది. నాగార్జునతో సంతోషం సినిమా తెరకెక్కించిన ఫ్యామిలీ సినిమా ల దర్శకుడు దశరథ్ ఈ సినిమాను డైరెక్ట్ చేసి మంచి హిట్ కొట్టారు. వాస్తవానికి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాను వి వి . వినాయక్ డైరెక్ట్ చేయాల్సి ఉంది. ఆది - చెన్నకేశవరెడ్డి - ఠాగూర్ - బద్రీనాథ్ సినిమా లు తీసిన వినాయక్ కు ఈ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు నిర్మాత దిల్ రాజు.
ప్రభాస్ హీరో అనగానే వినాయక్ డైరెక్టర్ అయితే బాగుంటుందని దిల్ రాజు అనుకున్నారు. కథ విన్న తర్వాత వినాయక్ దిల్ రాజ్ కి ఓ సలహా ఇచ్చారట .. కథ చాలా బాగుంది .. ప్రభాస్ కు బాగా సూట్ అవుతుంది కానీ నేను డైరెక్ట్ చేస్తే కథ ఫ్లేవర్ మొత్తం మారిపోతుంది .. యాక్షన్ ఎక్కువ అవుతుంది .. కథలో ఫ్యామిలీ ఆడియన్స్ కి కావాల్సిన కంటెంట్ ఎక్కువగా ఉంది అనడంతో చివరికి దిల్ రాజు సంతోషం సినిమాతో మంచి హిట్ కొట్టిన దశరధిని పిలిపించి కథ చెప్పారట. దశరథ్ కూడా కథ బాగుందని ... అప్పటివరకు ప్రభాస్ చేసిన సినిమాలుకు భిన్నంగా ఉండాలని మిస్టర్ పర్ఫెక్ట్ కథలో చిన్న చిన్న మార్పులు చేసి ప్రభాస్ ఇమేజ్ తగినట్టుగా తెరకెక్కించారు. అలా ఈ సినిమా సూపర్ హిట్ కొట్టింది. ఇక అంతకుముందు ప్రభాస్ వి వి . వినాయక్ కాంబినేషన్లో యోగి సినిమా తెరకెక్కి డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.