సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చాలా రోజుల తర్వాత హిట్‌ అందుకున్నారు. ఆయనకు రోబో తర్వాత చెప్పుకోదగ్గ బ్లాక్‌ బస్టర్‌ లేదు. కబాలి, 2.0, కాలా వంటి సినిమాలు యావరేజ్‌గానే ఆడాయి. 13ఏళ్లుగా రజనీ రేంజ్‌ ఇది అని చెప్పుకునే సినిమా రాలేదు. ఆడియెన్స్ లో, ఫ్యాన్స్ లో ఏదో ఒక అసంతృప్తి ఉండేది. ఆ లోటుని తీర్చింది జైలర్‌. రజనీ కొడితే ఏ రేంజ్‌లో ఉంటుందో ఈ మూవీ చూపించింది. సూపర్‌ స్టార్‌ దెబ్బని బాక్సాఫీసు కి రుచి చూపించింది. ఈ మూవీ ఆరు వందలకోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. నెల్సర్‌ దిలీప్‌ కుమార్‌ డైరెక్షన్‌ లోని మ్యాజిక్‌, రజనీకాంత్‌ మాస్‌ హంగామా, స్టయిల్‌, ఎలివేషన్లు, తమన్నా అందాలు, సునీల్, యోగిబాబు కామెడీ ఆద్యంతం ఆకట్టుకోవడంతో పాటు సినిమాని తిరుగులేని విజయాన్ని అందించాయి. దీనికితోడు శివ రాజ్‌ కుమార్‌ మాస్‌ ఎంట్రీ, మోహన్‌లాల్‌ స్పెషల్‌ మెరుపులు అదరగొట్టాయి. ఆడియెన్స్ ఊగిపోయేలా చేశాయి. ఈ మూవీ కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్స్ లో ఒకటిగా నిలిపింది.ఇప్పుడు ఈ మూవీ కి సీక్వెల్‌ రాబోతుంది. దర్శకుడు దిలీప్‌ కుమార్‌ ఆ ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నారు.జైలర్‌ 2`పై ఆయన వర్క్ చేస్తున్నారట.ఇదిలాఉంటే జైలర్ తర్వాత నెల్సన్‌ మరే మూవీ ని ప్రకటించలేదు.అయితే జైలర్ 2 స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయినట్లు సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది.సంక్రాంతి కి మూవీ పై అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. ఇందుకోసం సూపర్ స్టార్ తో మేకర్స్ స్పెషల్ వీడియోను రికార్డ్ చేసి నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ప్రస్తుతం లోకేష్ కనక రాజ్ డైరెక్షన్లో కూలీ చిత్రకరణ జరుగుతుంది.ఇదిలా ఉంటే రజనీకాంత్‌తో చేయాల్సిన  జైలర్‌2 ని నెక్ట్స్ లెవల్‌ లో ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: