- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .


టాలీవుడ్ సూప‌ర్ స్టార్ ఘ‌ట్ట‌మ‌నేని మ‌హేష్ బాబు త‌న ఫ్యామిలీ కి ఎంతో ప్ర‌యార్టీ ఇస్తాడు. మ‌హేష్ సినిమాల్లో ఎంత బిజీ ఉన్నా కూడా అటు భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్ తో పాటు కుమార్తె .. కుమారుడు కెరీర్ ను తీర్చిదిద్దే విష‌యంలో ఇప్ప‌టి నుంచే ప‌క్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్న‌ట్టు క‌నిపిస్తుంది. పీఎంజే జ్యూవెల్స్ మరో సరికొత్త క్యాంపెయిన్‌ను ఆవిష్కరించింది. పీఎంజే జ్యూవెల్స్ కు సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి ఘట్టమనేని సితార బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మోడర్న్ లిటిల్ ప్రిన్సెస్ సితార పీఎంజే జ్యూవెల్స్ విశిష్టతను, ప్రత్యేకతను ప్రతిబింబిస్తూ మరో క్యాంపెయిన్‌ కు శ్రీకారం చుట్టారు. ఈ క్యాంపెయిన్‌లోని సరికొత్త కలెక్షన్ ఆభరణాలు భారతీయ వారసత్వాన్ని, నైపుణ్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. పచ్చలు, వజ్రాలు, కెంపులతో అద్దిన, అత్యాధునికంగా, కళాత్మకంగా తయారైన ఎన్నోరకాలు డిజైన్ల కలెక్షన్ అందుబాటులో తీసుకు వచ్చారు పీఎంజే జ్యూవెల్స్. పెళ్లి నగలతోసహా ‌రకాల వేడుకల్లో ధరించేందుకు అనువుగా ఈ ఆభరణాలు తయారయ్యాయి.  


ఈ జ్యుయెలరీ కలెక్షన్‌ను మీరు ధరిస్తే రాయల్ లుక్‌ మీ సొంతం. వేడుక ఏదైనా సరే మీరు మెరిసిపోవడం ఖాయం. పీఎంజే జ్యువెల్స్ లేటెస్ట్ కలెక్షన్ ఆభరణాలు ధరించిన సితార ఫొటోలను టైమ్స్ స్క్వేర్ వద్ద ఆవిష్కరించారు. ఈ లేటెస్ట్ క్యాంపెయిన్ ద్వారా భారతీయ నగల విశిష్టత, ప్రత్యేకత ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తెలుసుకోబోతున్నారు. కళాత్మకమైన ఆభరణాల ప్రత్యేకతను చాటిచెప్పడమే కాకుండా భారతీయ వారసత్వాన్ని, నైపుణ్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకే ఈ క్యాంపెయిన్ అని పేర్కొన్నారు  పీఎంజే జ్యూవెల్స్. అన్నట్టు ఈ బ్రాండ్స్ ద్వారా తానూ సంపాదించిన మొత్తాన్ని మహేశ్ బాబు ఛారిటబుల్ ట్రస్ట్ కు డొనేట్ చేస్తానని ఘట్టమనేని సితార ఓ ఇంటర్వ్యూ లో  తెలిపింది ఘట్టమనేని వారసురాలు.




మరింత సమాచారం తెలుసుకోండి: