టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకుడిగా కెరియర్ను కొనసాగించిన వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. పూరి జగన్నాథ్ , మెగాస్టార్ చిరంజీవితో సినిమాను చేయడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇప్పటివరకు వీరి కాంబోలో ఒక సినిమా కూడా సెట్ కాలేదు. చిరంజీవి కొన్ని సంవత్సరాల క్రితం ప్రజారాజ్యం అనే పార్టీని పెట్టి రాజకీయాలపై ఆసక్తిని చూపించిన విషయం మనకు తెలిసిందే.

రాజకీయాల నుండి తప్పుకున్నాక చిరంజీవి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలి అనుకున్న సందర్భంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో భాగంగా చిరంజీవి హీరోగా పూరీ జగన్నాథ్ "ఆటో జానీ" అనే టైటిల్ తో ఓ సినిమాను రూపొందించనున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమా సెట్ కాలేదు. ఇది ఇలా ఉంటే ఆటో జానీ కంటే ముందే పూరి జగన్నాథ్ ఓ సినిమా కథను చిరంజీవికి వినిపించాడట. ఆయన మాత్రం ఆ సినిమాను రిజెక్ట్ చేశాడట. ఆ సినిమా ఏదో తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం పూరి జగన్నాథ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆంధ్రావాలా అనే సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా కథను పూరి జగన్నాథ్ , చిరంజీవి గారి కోసం రాసుకున్నాడట. అందులో భాగంగా ఆయనను కలిసి ఈ కథను కూడా వినిపించాడట.

కానీ చిరంజీవికి మాత్రం ఈ సినిమా కథగా పెద్దగా నచ్చలేదట. దానితో ఈయన ఆంధ్రావాలా స్క్రిప్టును రిజెక్ట్ చేశాడట. ఇక ఇదే స్క్రిప్టును పూరి జగన్నాథ్ , ఎన్టిఆర్ కు వినిపించగా , ఆయనకు ఈ సినిమా కథ అద్భుతంగా నచ్చడంతో వెంటనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలా చిరంజీవి రిజెక్ట్ చేసిన ఆంధ్రావాలా స్క్రిప్ట్ ను జూనియర్ ఎన్టీఆర్ పై పూరి జగన్నాథ్ రూపొందించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: