విశాల్ మేశ్రామ్ .. కరుడుగట్టిన గ్యాంగ్ స్టార్.. ఇతను గురువారం రాత్రి నాగపూర్ లోని ఓ మల్టీప్లెక్స్ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి పుష్ప 2 మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు .. పలు హత్య కేసుల్లో , డ్రగ్స్ కేసుల్లో నిందితుడిగా ఉన్న విశాల్ మేశ్రామ్ .. గత పది నెలలుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు .. అయితే ఇతను రీసెంట్గా విడుదలైన పుష్పా2 సినిమాను థియేటర్లో చూస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో .. అతనిని పట్టుకోవడానికి ట్రాక్ చేసినట్లు పచ్‌పోలీ పోలీస్ స్టేషన్ కు చెందిన అధికారి ఆదివారం మీడియాకు చెప్పారు .. అలాగే ఇతనిపై రెండు మర్డర్ కేసులు , డ్రగ్ అక్రమ రవాణాతో సహా మొత్తం 27 కేసులు ఉన్నాయని .. ఇక గతంలో పోలీసులపై కూడా పలుమార్లు దాడి చేసినట్లు చెప్పుకొచ్చారు.
ఇక పుష్ప2 సినిమా క్లైమాక్స్ సమయంలో పోలీసులు థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చి .. అప్పటికే నిందితుడు సినిమాలో ఫుల్లుగా మునిగిపోయి చూస్తున్నాడు .. అదే సమయంలో అతను చుట్టుముట్టిన పోలీసులు దగ్గరికి వచ్చి అతని తట్టేవరకు అతను ఈ లోకంలోకి రాలేదు .. వెంటనే అతను తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా వెంటనే అరెస్ట్ చేశారు .. ఆ తర్వాత నాగపూర్ సెంట్రల్ జైలుకు తరలించారు ..విశాల్ మేశ్రామ్ ని త్వరలోనే నాసిక్‌లోని జైలుకు తరలించబోతున్నట్లు పోలీసులు తెలిపారు .. అరెస్టు తర్వాత సినిమా పూర్తయ్యే వరకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో ప్రేక్షకులు తెలియని ఆశ్చర్యం లో మునిగిపోయారు.