ఇందులో కీలకమైన పాత్రలో సునీల్, వరలక్ష్మి శరత్ కుమార్, సుకృత తదితర నటీనటుల సైతం నటించారు. డిసెంబర్ 27న థియేటర్లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి పలు రకాల అప్డేట్లతో చిత్ర బృంద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసేలా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మేకర్స్ తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేశారు.. ట్రైలర్ విషయానికి వస్తే ఈ సినిమా మొత్తం కూడా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా మాక్స్ సినిమా ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. మొదట పొలిటికల్ కెరీర్ కి ఈ రాత్రి చాలా ఇంపార్టెంట్ అనే డైలాగ్ తో మొదలవుతుంది.. ఆ తర్వాత జరిగే రెండు హత్యల పరిణామాలు ఎలా మార్చాయి అనే కథా అంశంతో తెరకెక్కించారు. కిచ్చా సుదీప్ ఎంట్రీ.. వరలక్ష్మి శరత్ కుమార్ మధ్య జరిగే సన్నివేశాలు ఇలా అన్నిటిని కూడా హైలెట్ గా కనిపిస్తున్నాయి.
కిచ్చా సుదీప్ ఇందులో కూడా చాలా స్టైలిష్ గాని కనిపిస్తూ ఉన్నారు. ఇందులో పోలీస్ ఆఫీసర్గా మరొకసారి నటించబోతున్నారు..మరి మొత్తానికి ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా చిత్రంతో కిచ్చా సుదీప్ ఏ విధంగా సక్సెస్ అందుకుంటారో చూడాలి. కిచ్చా సుదీప్, వరలక్ష్మి శరత్ కుమార్ డైలాగ్స్ కూడా ఈ సినిమాకి హైలైట్ గా ఉండడమే కాకుండా బిజిఎం కూడా అదిరిపోయేలా ఉన్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి ట్రైలర్ మాత్రం హీట్ పుట్టిస్తోంది.