ఇప్పుడు ఇవన్నీ కలిసి అల్లు అర్జున్ కాంగ్రెస్‌కు శత్రువుగా మార్చింది . వీరు మద్దతు ఇవ్వగానే వారికి అనిపిస్తుంది గానీ.. వాటికోసం మరో నాలుగేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో వైరం రావడానికి అల్లు కుటుంబం ఇష్టపడుతుందా.. ఇప్పుడు ఇదే జరుగుతుంది.. అల్లు అర్జున్ ను వెనకేసుకొచ్చే అల్లు ఫాన్స్ మొత్తం తమ పార్టీలకు అండగా ఉంటారని అనుకుంటున్నారేమో గానీ .. బిఆర్ఎస్ , బిజెపిలకు చెందిన అగ్ర నాయకులు తమకు సంబంధం లేని వ్యవహారాన్ని తమ భుజాల మీద వేసుకొని ఇందులో వేలు పెడుతున్నారు .. అల్లు అర్జున్ అరెస్టు అయిన దగ్గర్నుంచి ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రతి పోకుడను తప్పుపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.
అలాగే రేవంత్ రెడ్డిని ఇరుకున్న పెట్టడం ఆయనను అవమానించటం.. తెలుగు చిత్ర పరిశ్రమకు రేవంత్ రెడ్డిని శత్రువుగా మారుతున్నారని రంగు పులిమేళా కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో ఆయన్ను నెగటివ్ ఇమేజ్ ఏర్పడే ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా వారి వ్యూహాల్లో భాగం కావచ్చు .. కానీ వారు పొగడలు శృతిమించి పోతున్నాయి .. అల్లు అర్జున్ తమ వైపు తిప్పుకోవటమే లక్ష్యంగా.. ప్రాక్టికల్గా విమర్శలు చేద్దామనే ఆలోచన ఈ రెండు పార్టీల్లో ఎక్కడ కనిపించడం లేదు. ఇలాంటి లాజిక్ లేకుండా అరెస్టును వెనకేసుకు వస్తున్నారు.. దీని కారణంగా అల్లు అర్జున్ పనికొట్టుకుని అన్ని పార్టీల నాయకులతో తమను తిట్టిస్తున్నారని రేవంత్ ప్రభుత్వం భావించే అవకాశం కూడా ఉంది .. దీని కారణంగా అల్లు అర్జున్ పై వారు వైరం పెంచుకుంటారు .. దీనివల్ల ప్రధానంగా అల్లు అర్జున్ కే నష్టం తప్ప .. లాభం కూడా లేదని రాజకీయ విశ్లేషలకు అంచనా వేస్తున్నారు .. మరి అల్లు అర్జున్ వ్యవహారం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.