స్టార్ హీరో రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ రిలీజ్ కు సమయం దగ్గర పడే కొద్దీ ఫ్యాన్స్ లో టెన్షన్ పెరుగుతోంది. ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన దోప్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ పొరపాట్లు చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా ముందు రెండు భారీ టార్గెట్లు ఉన్నాయని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
రాజమౌళి నెగిటివ్ సెంటిమెంట్ ను ఈ సినిమాతో చరణ్ బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అదే సమయంలో పుష్ప2 కలెక్షన్ల టార్గెట్ ను గేమ్ ఛేంజర్ బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంటే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. గేమ్ ఛేంజర్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.
 
గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ సమయానికి బాక్సాఫీస్ వద్ద పరిస్థితులు అనుకూలంగా మారాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రామ్ చరణ్, దిల్ రాజు ఈ సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచాల్సిన అవసరం అయితే ఉందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని సమాచారం అందుతోంది.
 
గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద కూడా గేమ్ ఛేంజర్ అవుతుందో లేదో తెలియాల్సి ఉంది. గేమ్ ఛేంజర్ సినిమా ఇతర భాషల్లో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అనే చర్చ సైతం జోరుగా జరుగుతుండటం గమనార్హం. గేమ్ ఛేంజర్ సినిమా సక్సెస్ సాధించడం మెగా ఫ్యాన్స్ కు సైతం ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది. రామ్ చరణ్  గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: