ఈ ఫంక్షన్‌కు డైరెక్టర్ సుకుమార్, బుచ్చిబాబు, వంటివారు హాజరయ్యారు .. ఇదే క్రమంలో దర్శకుడు శంకర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు .. టాలీవుడ్ హీరోలతో తాను ఇదివరకే సినిమాలు చేద్దామనుకున్నానని .. కానీ అది కుదరలేదని అన్నారు .. ఇక చివరకు రామ్ చరణ్‌తో మూవీ సెట్ అయింది అన్నారు .. ఇక శంకర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం గేమ్ చేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాను.. అందుకే ఇక్కడికి రావాలా ? వద్దా? అని ఎంతగానో ఆలోచించాను.. పోకిరి , ఒక్కడు లాంటి మాస్ ఎంటర్టైనర్ సినిమాలు చేయాలని అనుకున్నాను .. వాటిలోనూ నా మార్క్ ఉండాలని ఎంతో భావించాను .. అలాంటి ఆలోచనతో చేసిందే ఈ సినిమా... తమిళం హిందీలో సినిమాలు చేశాను కానీ తెలుగులో గేమ్ చేంజర్ ఇదే నా మొదటి సినిమా.. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని భావించాను .. కానీ అది కుదరలేదు.. ఆ తర్వాత మహేష్ బాబుతో కూడా సినిమా చేయాలని చూశాను కానీ అది సెట్ కాలేదు ..
చివరకు కరోనా సమయంలో ప్రభాస్ తో కూడా చర్చలు జరిగాయి అది సెట్ కాలేదు .. ఇప్పుడు ఎలాగో రామ్ చరణ్ తో సినిమా రాసిపెట్టి ఉంది .. ఒక గవర్నమెంట్ అధికారి రాజకీయ నాయకులు మధ్య సంఘర్షణ చుట్టూ ఈ సినిమా కథ ఉంటుంది .. ఇక ఇందులో రామ్ చరణ్ ఎంతో సేటిల్ గా నటించారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తమ నటనతో అదరగొట్టారు అంటూ శంకర్ చెప్పుకొచ్చారు. ప్రజెంట్ గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న రామ్‌చరణ్.. ఆ తర్వాత దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమా చేయనున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక మరి రామ్ చరణ్ గేమ్ చేంజెర్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అంచనాలు అందుకుంటారో చూడాలి.