ఏంటి అల్లు అర్జున్ తో పాటు రష్మిక కూడా జైలుకు వెళ్లబోతుందా.. ఇది నిజమేనా.. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎంత నిజం ఉంది. ఇంతకీ రష్మిక జైలుకు వెళ్తుందా..లేదా  సోషల్ మీడియాలో ఉన్న పోస్టుల్లో ఏముంది అనేది ఇప్పుడు చూద్దాం. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా పుష్ప-2 సినిమా విడుదలైంది.కానీ ఒకరోజు ముందుగానే డిసెంబర్ 4న ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షో లు వేశారు.అయితే డిసెంబర్ 4న  సంధ్య థియేటర్లో ప్రీమియర్ షో చూడడం కోసం అల్లు అర్జున్ తన ఫ్యామిలీ అలాగే హీరోయిన్ రష్మిక తో కలిసి వచ్చాడు. ఇక అలా వస్తున్న సమయంలో అల్లు అర్జున్ ని చూడడానికి అభిమానులు ఎగబడడంతో అంత రచ్చ రచ్చ జరిగి ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో పాటు ఆమె కొడుకు తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం ఆయన బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది.ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నాడు.

ఇక ఈ వివాదంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే.అల్లు అర్జున్ థియేటర్ కి రావడానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వకున్నా కూడా వచ్చాడని రోడ్ షో చేశాడని పోలీసులు ఖరాకండిగా చెప్పేశారు. ఇక ఈ వివాదంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు కావడంతో ఆయన ఒకరోజు జైలు జీవితాన్ని గడిపారు. అయితే ఈ విషయంలో చాలామంది సినీ సెలబ్రిటీలు అల్లు అర్జున్ కి మద్దతు తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి వారందరికీ షాక్ ఇస్తూ చావు బతుకుల మధ్య కొట్టుమీట్టాడుతున్న బాలుడిని చూడడానికి ఎవరూ రావడం లేదు. కానీ ఆ హీరో కి కాలు విరిగినట్టు చెయ్యి విరిగినట్టు చూడ్డానికి అందరూ వెళ్తున్నారు అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. అయితే తొక్కిసలాటలో రేవతి మృతి చెందిన ఇష్యులో కేవలం అల్లు అర్జున్ ది మాత్రమే తప్పు కాదని, అందులో చాలామంది తప్పు ఉందని, కేవలం అల్లు అర్జున్  నే నిందితుడిగా ఎలా చూస్తారు అని చాలామంది ఇప్పటికే అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తున్నారు.అయితే తాజాగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ తో పాటు రష్మిక కూడా జైలుకు వెళ్లాల్సిందే అంటున్నారు.

 ఎందుకంటే రష్మిక కూడా అక్కడికి రావడానికి పర్మిషన్ లేదు.కానీ ఆమె కూడా వచ్చింది.ఇక రష్మిక కూడా సెలబ్రిటీ కాబట్టి ఆమెని చూడ్డానికి కూడా జనాలు ఎగబడ్డారు. అలా అల్లు అర్జున్ మాత్రమే కాదు రష్మిక కూడా ఈ కేసులో భాగమైంది. కానీ అల్లు అర్జున్ ని మాత్రమే అరెస్ట్ చేశారు. అలా ఎందుకు రష్మికను కూడా అరెస్టు చేయాల్సిందే.. బన్నీకి ఒక న్యాయం రష్మికకి ఒక న్యాయమా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తున్నారు. మరి ఈ వివాదం రష్మిక మెడకు కూడా చుట్టుకుంటుందా.. లేదా అల్లు అర్జున్ తోనే ఎండ్ అవుతుందా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: