పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన శ్రీ లీల .. ఆ తర్వాత ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకుని స్టార్ హీరోయిన్గా మారింది .. టాలీవుడ్ అగ్ర నిర్మాతలు మొత్తం ఆమెతో సినిమాల కోసం క్యూ కట్టారు.. రోజుకి ఈమె మూడు నాలుగు సినిమాల షూటింగులో పాల్గొనేది .. అలా చేతికి వచ్చిన ప్రతి సినిమా చేయటం స్క్రిప్ట్ ని సరిగ్గా ఎంచుకోకపోవడం కారణంగా ఈమెకు ధమాకా తర్వాత భగవంత్ కేసరి తప్ప మరో సినిమా హిట్ కాలేదు .. ఈ సంవత్సరం మహేష్ బాబుతో కలిసి చేసిన్న గుంటూరు కారం సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఈ సినిమా తర్వాత ఈ ఏడాది ఈమె నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు.. రీసెంట్గా పుష్ప 2 సినిమాలో కిస్సిక్ సాంగ్ ద్వారా కాస్త హైలైట్ అయింది. గత సంవత్సరం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డే.. తర్వాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ భారీ విజయాలు అందుకుంటూ సౌత్ లోనే టాప్ హీరోయిన్గా మారింది .. కానీ ఆకస్మాత్తుగా ఈమెకు వరుస డిజాస్టర్లు రావడం కారణంగా ఈమెను టాలీవుడ్ హీరోలు పూర్తిగా పక్కకు పెట్టేశారు ..
ఎంతలా అంటే గుంటూరు కారం సినిమాలో శ్రీలీల పాత్రను ముందుగా పూజ హెగ్డే చేసింది .. కానీ ఆ తర్వాత ఈమెని సినిమా నుంచి తప్పించి శ్రీలీలతో ఆమె క్యారెక్టర్ని రిప్లై చేశారు .. ఇప్పుడు ఆమె చేతులు ఒక్క తెలుగు సినిమా కూడా లేదు .. కానీ కోలీవుడ్ లో ఈమెకి దళపతి విజయ్ చివరి సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది.. ఈ సినిమాతో పాటుగా కోలీవుడ్ లో కాంచన 4 లో కూడా నటించనుంది .. ఈ సంవత్సరం బాగా హైలైట్ అయిన హీరోయిన్స్ లో భాగ్యశ్రీ భోర్ సే, మీనాక్షి చౌదరి .. వీరిద్దరిలో భాగ్యశ్రీ నటించిన మిస్టర్ బచ్చన్ ప్లాప్ అయినప్పటికీ .. దర్శక నిర్మాతల కన్ను ఈమె మీద పడింది.. ఇప్పుడు వరుసగా చేతునిందా సినిమాలతో దుసుకుపోతుంది.. మరోపక్క మీనాక్షి చౌదరి కూడా ఈ ఏడాది లక్కీ భాస్కర్ సినిమా తర్వాత మరో హిట్ పడలేదు .. అయినప్పటికీ కూడా ఈమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి .. మధ్యలో తలుక్కున మెరిసిన నబా నటేష్, కేతిక శర్మ వంటి వారి అడ్రస్ గల్లంతయిపోయింది.