వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ ఈ నెల 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. అనన్య నగళ్ల ఈ మూవీలో ముఖ్యమైన రోల్ లో నటిస్తున్నారు. సుదీప్ హీరోగా తెరకెక్కిన మాక్స్ ఈ నెల 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
కీర్తి సురేష్ తొలి బాలీవుడ్ మూవీ బేబీ జాన్ ఈ నెల 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. తేరి సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఓటీటీలో రిలీజ్ కానున్న సిరీస్ లు, వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ నెల 26వ తేదీన స్క్విడ్ గేమ్2 స్ట్రీమింగ్ కానుంది. సార్గవాసల్ తమిళ్ వెర్షన్, భూల్ బూలయ్యా3 హిందీ వెర్షన్ ఈ నెల 27న స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.
అమెజాన్ ప్రైమ్ లో సింగం అగైన్ హిందీ వెర్షన్, థానర మలయాళ వెర్షన్ ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ అవ్వనున్నాయి. జియో సినిమాలో ఈ నెల 27వ తేదీన డాక్టర్స్ హిందీ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. హాట్ స్టార్ లో డిసెంబర్ 26వ తేదీన డాక్టర్ వూ స్ట్రీమింగ్ కానుండటం గమనార్హం. జీ5 లో ఖోజ్ హిందీ వెర్షన్ డిసెంబర్ 27వ తేదీన స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.