సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. ఈ సినిమాలతో మహేష్ బాబు సూపర్ స్టార్‌గా ఎదిగారు. అటు ఈయన కెరీర్‌లో బ్లాక్ బస్టర్స్‌తో పాటు డిజాస్టర్ మూవీస్ ఉన్నాయి. మొత్తంగా మహేష్ బాబు కెరీర్‌లో టాప్ డిజాస్టర్ మూవీస్ విషయానికొస్తే అందులో బ్రహ్మోత్సవం ఒకటి.శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు రెండోసారి హీరోగా నటించిన మూవీ ‘బ్రహ్మోత్సవం’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర రూ. 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేయడం విశేషం. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 36 కోట్ల షేర్ రాబట్టి డిజాస్టర్‌గా నిలిచింది.ఇదిలావుండగా ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ సినిమా బావుంటే ఆడియన్స్ నుంచి సహకారం ఉంటుంది. సినిమా బాగలేకపోతే వాళ్లే ఆ మూవీని త్వరగా చంపేస్తారు. ఈ రెండింటికి సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా బ్రహ్మోత్సవం లాంటి సినిమాలు చేస్తే నా అభిమానులకు నేను సమాధానం చెప్పుకోలేను. ఎందుకంటే అది కంప్లీట్ గా ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రం. ఏదీ సరిగ్గా వర్కౌట్ కాలేదు.ఆ స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేయడమే నేను నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అని మహేష్ బాబు అన్నారు. అసలు ఆ కథని ఎందుకు ఎంచుకున్నానా అని ఫీల్ అయ్యా. ఇకపై అలాంటి తప్పులు రిపీట్ చేయను అని మహేష్ బాబు తెలిపారు.ఇదిలా ఉండగా త్వరలో మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తన కెరీర్ లోనే భారీ చిత్రానికి రెడీ అవుతున్నారు.ఇదిలావుండగా ఎస్ ఎస్ యమ్ బి 29 క్యాస్టింగ్‌పైనా గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. ఇందులో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా పేరు రెండు మూడు రోజులుగా వినిపిస్తూనే ఉంది.తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు తోడైంది. 2025లో షూట్ మొదలు పెట్టి.. 2027లో విడుదల చేయాలనేది జక్కన్న ప్లానింగ్. ఇది నిజమే అయితే.. మహేష్ ఫ్యాన్స్‌కు పండగే.

మరింత సమాచారం తెలుసుకోండి: