టాలీవుడ్ లో భారీ యాక్షన్ సినిమాలు చేయటంలో బోయపాటి శ్రీను , బాబి కొల్లి ఒక‌ర‌ని మించిన ఒకరు గొప్ప స్పెషలిస్ట్ అని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. స్టార్ హీరోలతో యాక్షన్ సినిమాలు తీసి మెప్పించడంలో ఎవరికీ వారే సాటి .. మేకింగ్ పరంగా ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది .. ఇప్పటివరకు బాలయ్యకు తిరుగులేని మూడు విజయాలు ఇచ్చారు బోయపాటి .. ఇక అఖండ తాండవంతో నాలుగు విజయాన్ని నమోదు చేయడానికి రెడీ అవుతున్నారు .. బోయపాటి డైరెక్షన్లోని డబుల్‌ హ్యాట్రిక్ సాధించాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు.


దర్శకుడు బాబి కూడా సీనియర్ హీరోలకు తనదైన స్టైల్ లో విజయాలు ఇస్తున్నారు.. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య చేసి విజయాన్ని ఇచ్చారు .. ఇప్పుడు డాకు మహారాజ్ తో బాలయ్యకు అంతకుమించి సూపర్ హిట్ ఇవ్వాలని రెడీ అవుతున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తిచేసుకుని సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదే క్రమంలో రీసెంట్గా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోయపాటి సినిమాలకు పోటీగా డాకు మహారాజ్‌ ఉంటుందా ? అనే ప్రశ్న దర్శకుడు బాబి ముందుకు వచ్చింది.. దానికి బాబి తాను ఎవరికీ పోటీ కాదన్నారు.. అలాగే బోయపాటి విజయాన్ని.. ఆయన బాలకృష్ణ కాంబినేషన్ ని ప్రస్తావిస్తూ.. మూడు భారీ విజయాలను ఇచ్చారు ఇది ఒక గొప్ప కాంబినేషన్..


 ఆయనకు నేను ఎలా పోటీ అవుతాను .. ఆయన కంటూ ఓ సపరేట్ స్టైల్ ఉంది.. నాకు కూడా అలాగే ఓ స్టైల్ ఉంది ... నేను ఎవరికీ పోటీ కాదు.. ఎవరి సినిమాలు వారివి .. కానీ నా గత సినిమాల కంటే బెటర్ గా తీయాలని మాత్రం ఎప్పుడూ చూస్తాను. గత విజయాలని సినిమాలని సరిచూసుకొని తదుపరి సినిమా ఎలా ఉండాలి ? అన్నది తెలుసుకొని ముందుకు వెళతాను. ఇక్కడ ఒక సినిమాకి సినిమాకి అప్డేట్ అవ్వటం అన్నది చాలా ముఖ్యం అని బాబి అన్నారు .. అలాగే ఈ సినిమా నిర్మాత నాగ‌ వంశీ కూడా రజినీకాంత్ జైలర్ సినిమా కంటే గొప్ప సినిమా చేయాలనేది నా ఆశని ఆయన చెప్పకు వచ్చారు .. దర్శకుడు నెల్సన్ మేకింగ్ చూసి సినిమా ఎలా కూడా చేయొచ్చా? అన్న కొత్త ఐడియా ని అందించారు. ఇక మరి డాకు మహారాజ్ వచ్చే సంక్రాంతికి ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: