బెయిల్ పై బయటికి వచ్చిన వెంటనే మెగా కుటుంబ సభ్యులను కలిశాడు అల్లు అర్జున్ .. నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లి తన మేనమామను కలిశాడు .. అలాగే చిరంజీవితో పాటు కలిసి భోజనం కూడా చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆల‌గే నేరుగా నాగబాబు ఇంటికి కూడా వెళ్లాడు .. అల్లు అర్జున్ చూసిన వెంటనే నాగబాబు సాదరంగా ఇంట్లోకి తీసుకువెళ్లాడు. ఇదే ఊపులో చిన్న మేనమామ పవన్ కళ్యాణ్ ని కూడా కలిసెందుకు అల్లు అర్జున్ ప్రయత్నించారంటూ వార్తలు వచ్చాయి ..


కానీ అది ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అల్లు అర్జున్ కు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ దొరకటం కష్టం అవ్వచ్చు అని కూడా అంటున్నారు .. ఒక విధంగా చూసుకుంటే ఇది సాధ్యం కాదని కూడా చెప్పవచ్చు . ప్రజెంట్ అల్లు అర్జున్ కు తెలంగాణ గవర్నమెంట్ మధ్య గట్టి యుద్ధం నడుస్తుంది .. ఎవరు అవునన్నా కాదన్నా ఇది ముమ్మాటికి నిజం.   అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే .. అటుపక్క పోలీస్ బాస్‌లు కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్ పై వీరుచుకుపడుతున్నారంటే పరిస్థితి ఎంతలా మారిందో అర్థం చేసుకోవచ్చు.


అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తో సంధ్య థియేటర్ ఘటన పూర్తిస్థాయిలో రాజకీయ రంగు పులుముకుంది .. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ తో పవన్ కళ్యాణ్ సమావేశమైతే .. రాజకీయంగా అది మరింత మూదురుతుంది .. ఇక ఇది అల్లు అర్జున్ కు పవన్ కు కూడా గట్టి తలనొప్పులు తెచ్చిపేడుతుంది. పవన్ కళ్యాణ్ కేవలం ఒక్క హీరో మాత్రమే కాదు .. అలాగే మెగా కుటుంబంలో ఒక కుటుంబ సభ్యులు మాత్రమే కాదు ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం .. ఈ హోదాలో అల్లు అర్జున్ కు అపాయింట్మెంట్ ఇస్తే .. ఈ వివాదం మరింత కఠినమవుతుందనేది రాజకీయ విశ్లేషకులు వాదన .. కాబట్టి ఇప్పట్లో అల్లు అర్జున్ కు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ రాకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: