ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బిజెపి అన్న పంతాన యుద్ధం జరుగుతుంది .. పోలీసులు అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేయించే దిశగా అడుగులు వేస్తున్నారు .. అందుకోసం టోటల్ సీసీ ఫుటేజ్ ను బయటకు తీశారు .. మీడియా ముందు దాన్ని పెట్టారు .. ఇప్పుడు ఈ కేస్ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కే అవకాశం కచ్చితంగా కనిపిస్తుంది .. ఈ సమయంలో అల్లు అర్జున్ కు అండగా ఉండేది బిజెపి మాత్రమే. ఇప్పటికే మెగా హీరో పవన్ కళ్యాణ్ ఏపీలో బిజెపి కూటమిలో ఉన్నారు .. జనసేన పార్టీ స్థాపించిన దాన్ని మొదటి నుంచి బిజెపికి అండగానే ఉంచుతున్నారు .. ఇక 2019 ఎన్నికల్లో మాత్రమే బిజెపితో విభేదించారు .. ఇప్పుడు బిజెపికి వీర విధుయుడిగా పవన్ ఉన్నారు.
తెలంగాణలో ఇలాంటి బలమైన మాస్ జనాల అట్రాక్షన్ బిజెపికి లేదు .. ఇప్పుడు అల్లు అర్జున్ గనుక తమ వైపు వస్తే అది పార్టీకి ఉపయోగపడుతుందని .. అల్లు అర్జున్ మామ రాజకీయ నాయకుడే కాంగ్రెస్ లో ఉన్నాడు .. దాని కారణంగా ఇప్పటి నుంచే ఎంతో దూరదృష్టతో బీజేపీ నాయకులు పావులు కదుపుతున్నారని తెలుస్తుంది. నేరుగా ముఖ్యమంత్రిని గవర్నమెంట్ ని ఢీ కొట్టాల్సి వస్తున్న క్రమంలో అల్లు అర్జున్ కి కూడా బిజెపి కేంద్ర పెద్దల మద్దతు చాలా అవసరం .. అది ఉంటేనే అతను ఈ గడ్డు పరిస్థితి నుంచి బయటికి రాగలడు. మొత్తం మీద తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు యమ రంజుగా మారుతున్నాయి .. సంధ్య థియేటర్ ఘటన రాజకీయరంగు బాగా పులుముకుంది.