ప్రస్తుతం తెలంగాణలో ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే అది అల్లు అర్జున్ వివాదమే అని చెప్పుకోవచ్చు.. అల్లు అర్జున్ ప్రస్తుతం పెద్ద వివాదంలో ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ వివాదాన్ని పెంచే ప్రయత్నాలే చేస్తున్నారు కానీ తగ్గించే ప్రయత్నాలు అయితే చేయట్లేదు. ఇక అల్లు ఫ్యామిలీకి ఎవరు డైరెక్షన్ చేస్తున్నారో తెలియదు కానీ పూర్తిగా రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారు..అంటూ ప్రముఖ జర్నలిస్టు అల్లు అర్జున్ వివాదంపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. అల్లు అరవింద్ గారు చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నవారు. ఆయన ఎవరినైనా సరే నవ్వుతూ పలకరిస్తారు. అలాంటి అల్లు ఫ్యామిలీకి ఇలా ఎందుకు జరుగుతుందో తెలియడం లేదు.అయితే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ పై మాట్లాడిన వెంటనే అల్లు అర్జున్ భారీ ప్రెస్ మీట్ పెట్టడం పెద్ద తప్పు.ఇది ఎవరు చేయమని చెప్పారో కానీ రాంగ్ డైరెక్షన్..

 ప్రెస్ మీట్ పెడితే పెట్టాడు గాని ఆ ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారు అన్న మాటలకు నాకు చాలా బాధనిపిస్తుంది. నేను అలా చేయలేదు అని అంటే బాగుండు. కానీ నాకు పోలీసులు చెప్పలేదు.నా దగ్గరికి ఎవరు రాలేదు.నాకు చనిపోయిన విషయం రెండు రోజుల తర్వాత తెలిసింది అంటూ చెప్పడంతో పోలీసులకు మండిపోయి వెంటనే వీడియోలు రిలీజ్ చేసి అల్లు అర్జున్ కి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇక ఈ వీడియోలు వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ అబద్ధాల కోరని, ఆయన అన్ని అబద్ధాలు చెబుతున్నారు అంటూ ఎంతో మంది అల్లు అర్జున్ పై ఫైర్ అయ్యారు. అసలు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో ఆ మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది.

ఆ మాటలు మాట్లాడి ఆయన వ్యక్తిత్వం మీద ఆయన  నిందలు వేసుకున్నారు.ఇక ఈ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలని ఎవరు చెప్పారో కానీ పూర్తిగా రాంగ్ డైరెక్షన్..అలాగే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంతో వివాదం మరింత ముదిరింది. ఈ వివాదాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి కానీ పెంచుకునే ప్రయత్నం మాత్రం చేయవద్దు. అల్లు అరవింద్ గారు గానీ అల్లు అర్జున్ గారు గానీ వాస్తవంలోకి వచ్చి చూడండి. ఏం జరుగుతుందో ముందుగానే అంచనాలు వేసి పరిస్థితులకు తగ్గట్టు మాట్లాడండి.కానీ ఇలా భారీ ప్రెస్ మీట్ లు పెడుతూ మీ వ్యక్తిత్వాన్ని మీరే కించపరచుకోకండి అంటూ ప్రముఖ జర్నలిస్టు అల్లు అర్జున్ వివాదంపై స్పందించారు

మరింత సమాచారం తెలుసుకోండి: