ఈ కేసులో అల్లు అర్జున్ ఇప్పటికీ కూడా పలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఎదుర్కొంటున్నారు. చాలామంది సపోర్టు చేస్తూ ఉండగా మరి కొంతమంది నెగటివ్గా కామెంట్స్ చేస్తూ ఉన్నారు.. మెగా అభిమానులు కూడా అల్లు అర్జున్ ని ఏకిపారేయడం జరుగుతోంది. ఎందుకంటే మెగా కుటుంబం నుంచి అల్లు అర్జున్ బయటికి వచ్చారని మెగా కుటుంబ సభ్యుల కింది అల్లు అర్జున్ ఉండాలనే విధంగా ఎన్నోసార్లు ట్రోల్ చేయడమే కాకుండా పుష్ప 2 రిలీజ్ సమయంలో కూడా నానా హంగామా చేశారు.
అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వ నేతలు కూడా చాలామంది అల్లు అర్జున్ ని విమర్శిస్తూ ఉన్నారు. తాజాగా మంత్రి సీతక్క కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా పోలీసుల దుస్తులు విప్పి నిలబెడితే జాతీయ అవార్డులు ఇవ్వడం ఎందుకు సంకేతం అంటూ ఆమె ప్రశ్నించింది.. అలాగే జై భీమ్ వంటి సినిమాలకు అవార్డులు, ప్రోత్సాహాలు రాలేదని స్మగ్లర్లని హీరో చేస్తే పోలీసులను విలన్ చేస్తే అవార్డులు వస్తున్నాయంటూ ఆమె మండిపడింది. ఇలాంటి సినిమాలు నేరాలను పెంచేలా ఉంటాయని మానవత దృక్పథం ఉన్న సినిమాలు రావాలి అంటూ ఆమె ఫైర్ అయ్యింది.