కేరళకు చెందిన ఈ మలయాళీ బ్యూటీ .. గత సంవత్సరం నరకాసుర అనే సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది .. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకోలేకపోయింది .. ఇక దాంతో తమిళంలో ‘హిగుటా’, ‘కదువెట్టి’ అనే రెండు సినిమాల్లో నటించింది .. ఇవి కూడా సంగీర్తన విపిన్ కు మంచి గుర్తింపు తీసుకురాలేకపోయింది .. అలాగే ఈ సంవత్సరం తెలుగులో నటించిన ఆపరేషన్ రావణ్ సినిమా కూడా ఈమెకు కలిసి రాలేదు ..
అయినా కూడా ఆ తర్వాత తెలుగులో సుహాస్ కు జంటగా ‘జనక అయితే గనక’ అనే సినిమాలో సంగీర్తనకు మంచి సక్సెస్ రావటమే కాదు ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది .. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటనకు మంచు మార్కులే పడ్డాయి .. ఈమెకు వరుస అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు .. కానీ ఈ అమ్మడికి హిట్ వచ్చిన అదృష్టం కలిసి రాలేదు .. ఇప్పటివరకు మరి ఏ ఆఫర్ ఈమె దగ్గరకు రాలేదుు .. తాజాగా సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ కు సంబంధించిన దేవకన్య లాంటి ఫోటోలు తెగా వైరల్ అవుతున్నాయి .. ఇక మరి రాబోయే రోజులైనా ఈమెకు కాలం కలిసి వస్తుందో లేదో చూడాలి.