అయినప్పటికీ కూడా పుష్ప 2 విషయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట విషయం గురించి రోజుకొక విషయం బయటికి వస్తూనే ఉంది.. ముఖ్యంగా అటు పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం ఇటు అల్లు అర్జున్ మధ్య సరైన పొంతన లేకుండా పోతోంది. అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి రూ .20 కోట్లు ఇవ్వాలని కొంతమంది డిమాండ్ చేస్తూ అల్లు అర్జున్ ఇంటి మీద కూడా దాడి చేయడం జరిగింది. అలాగే రష్మిక కూడా డబ్బులు ఇవ్వాలని కూడా చాలామంది ఆందోళనకు దిగుతున్నారు.
ఇలాంటి సందర్భంలోనే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు రేవతి కుటుంబానికి సైతం ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది మైత్రి మూవీ నిర్మాణ సంస్థ నవీన్ ఈ రోజున రూ .50 లక్షల రూపాయలు చెక్కును మృతురాలి కుటుంబానికి సైతం అందించగా.. అలాగే తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీ తేజ చికిత్స తీసుకుంటున్న హాస్పిటల్ కి వెళ్లి మరి నవీన్ ఆ బాదిత కుటుంబాన్ని పరామర్శించి మరి ఈ చెక్కును అందజేసినట్లు సమాచారం. మొత్తానికి ఎట్టకేలకు పుష్ప 2 చిత్రానికి, అల్లు అర్జున్ కి సంబంధించి ఈ విషయం మాత్రం కాస్త ఊరట ఇస్తోందని చెప్పవచ్చు.