అయితే ఆ తర్వాత మోహన్ బాబు వెళ్లి స్వయంగా ఆ జర్నలిస్టుని పరామర్శించిన కూడా మోహన్ బాబుని చాలామంది పరారీలో ఉన్నాడనే విధంగా రూమర్స్ క్రియేట్ చేశారు. ఈ విషయం పైన అటు మంచు కుటుంబం, మోహన్ బాబు స్పందించినప్పటికీ కూడా రూమర్స్ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా పోలీస్ కేసుకు భయపడి మోహన్ బాబు అరెస్టు అవుతారనే భయంతో ఎక్కడో దాకున్నారనే విధంగా వార్తలు వినిపించాయి. మోహన్ బాబు మాత్రం ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా తాజాగా హైకోర్టు కూడా ఆ కేసును కొట్టివేసిందట.
మోహన్ బాబు ఇండియాలో ఉన్నట్టుగా అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ తన మనవరాలను చూసేందుకు సైతం తాను దుబాయ్ కి వెళ్లి తిరుపతి వచ్చినట్లుగా వెల్లడించారు.. అయితే మోహన్ బాబు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అంటూ ఆయన న్యాయవాది రవిచంద్ర కూడా తెలిపారు. మెడికల్ రిపోర్టు చూపించాలి అంటూ హైకోర్టు కోరగా.. ప్రస్తుతం న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో తాను మెడికెషన్ లో ఉన్నట్లుగా న్యాయవాది వెల్లడించారు.. సరైన రిపోర్టులు చూపించకపోతే బెయిల్ పిటిషన్ కొట్టేస్తుంది అంటూ హైకోర్టు కూడా హెచ్చరించింది. దీంతో ఏ క్షణంలోనైనా మోహన్ బాబు అరెస్టు కావచ్చు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈనెల 11వ తేదీన జర్నలిస్ట్ రంజిత్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని పరిశీలించి హైకోర్టు ఇలాంటి నిర్ణయం ఇచ్చింది.