తెలుగు సినీ ఇండస్ట్రీలలో మంచు కుటుంబం కాస్త డిఫరెంట్ అని చెప్పవచ్చు. వారు మాట్లాడే మాటలు, చేసే సినిమాలు అన్నీ కూడా చాలా డిఫరెంట్ గానే ఉంటాయి. ముఖ్యంగా మంచు లక్ష్మి మాట్లాడే మాటలు కూడా కొంతమంది ట్రోల్ చేసే విధంగా ఉంటాయి. మంచు లక్ష్మి ఏ సమయంలో ఎక్కడ ఉంటుందో ఎవరికీ తెలియదు.. అయితే అప్పుడప్పుడు మాత్రం పలు రకాల టీవీ షోలలో కనిపిస్తూ ఉంటుంది. కొన్ని రోజులు అమెరికా మరికొన్ని రోజులు హైదరాబాద్ ఇలా యూరప్ వంటి ప్రాంతాలలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మంచు లక్ష్మి.


కానీ తన భర్తతో కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి.. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత రెండవ పెళ్లి చేసుకున్నటువంటి మంచు లక్ష్మి తన భర్తతో కలిసి ఉండటం లేదనీ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ విషయంపై ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి రూమర్స్ అన్నిటికి చెక్ పెడుతూ మంచు లక్ష్మి తన కుటుంబం పైన వస్తున్న వార్తలు నిజం లేదని తెలియజేసింది. తన భర్తకు తాను ఎందుకు దూరంగా ఉంటున్నాననే విషయం పైన కూడా మాట్లాడింది.


తన తండ్రికి అలాగే సోదరులకు తను అంటే చాలా ఇష్టమని.. అందుకనే తాను ఎక్కువగా పుట్టింట్లోనే ఉంటానని తెలిపింది. అందరి ఆడవాళ్ళలాగే తనకు కూడా వివాహమైన తర్వాత అత్తగారింటికి వెళ్లాలి అంటే నచ్చదని అందుకే తన తండ్రి ఇంట్లోనే  కుంటున్నానని క్లారిటీ ఇచ్చింది.. తనకు చిన్న కుటుంబంలో ఉండడం మరింత ఇష్టమని.. కానీ కరోనా సమయంలో తనకు ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయని.. ఆ సమయంలో రేపు ఉంటామో పోతామో తెలియదు కానీ అందరూ కలిసి ఒకే చోట ఉండడం మంచిదనిపించింది అని.. అందుకే తన మనశాంతి కోసం తన భర్త.. అలాగే తన భర్త మనశ్శాంతి కోసం తాను నచ్చిన చోట ఉంటామంటూ తెలియజేసింది. అయితే తరచు తాము కలుస్తూనే ఉంటామని తెలిపింది మంచు లక్ష్మి. కానీ తన కుటుంబంలో జరుగుతున్న గొడవల పైన మాత్రం స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: