ఇక శ్యామ్ బెనగల్ 1934 డిసెంబరు 14న హైదరాబాదులోని తిరుమలగిరిలో జన్మించారు. ఆయన పూర్తిపేరు శ్యామ్ సుందర్ బెనగల్. అడ్వర్టైజింగ్‌లో కాపీ రైటర్‌గా శ్యామ్ బెనగల్ కెరీర్ ప్రారంభించారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో చదువుకున్న ఆయన సామాజిక అంశాలపై సినిమాలు రూపొందించి దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు. అలాగే చాలా దూరదర్శన్ సీరియల్ లకు కూడా ఈయన దర్శకత్వం వహించారు. అనేక అవార్డులు పొందారు. ఈయన బాలీవుడ్ లో అంకుర్, భూమిక, నిషాంత్, కలయుగ్, మంతన్ సహా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. శ్యామ్ బెనగల్ చేసిన కృషికి కాను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీ పురస్కారాన్ని, 1991లో పద్మ భూషణ్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. 2007, ఆగస్టు 8 న భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రముఖమైన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని 2005 సంవత్సరానికి గాను అందుకున్నాడు. భారత జాతీయ సినిమా అవార్డులలో శ్యామ్ బెనగల్ ఏడు సార్లు హిందీలో అత్యుత్తమ సినిమా అవార్డును దక్కించుకున్నాడు. ఈయన 2006 నుంచి 2012 మధ్య రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు.
సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ గురించి దర్శకుడు బి.నర్సింగరావు మాట్లాడుతూ.. శ్యామ్ బెనగల్ ను చాలా సార్లు కలిశారని అన్నారు. గతంలో వారిద్దరి ఇల్లుళ్లు కూడా పక్క పక్కనే ఉండేవని తెలిపారు. మొదటిసారి బేగంపేట ఎయిర్ పోర్టులో ఆయనని కలిశానని.. ఇక చివరిగా ఏడాదిన్నర కిందట ఆయనతో మాట్లాడనని నర్సింగరావు చెప్పారు. అప్పుడు ఆయన ఆరోగ్యం సరిగా లేదని చెప్పారని.. ఎక్కువసేపు మాట్లాడలేకపోయానని అన్నారు. శ్యామ్ బెనగల్ మృతి చెందడంతో మెగా స్టార్ చిరంజీవి మరియు ఇతర నటులు రాజకీయ నాయకులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు.