అయితే ఆ ఫోటోకి ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ పెట్టాడు. 'ఏనుగు తలపై పిల్లాడు కూర్చొని ఉన్న చిత్రాన్ని జాగ్రత్తగా చూడండి, వెనుక నుండి ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారని పేద పిల్లవాడికి తెలియదు కానీ మీరు ఆ గ్యాప్ సృష్టించి పిల్లోడిని రక్షించారు, ఆ సంఘటనను ఆపారు. మీరు చాలా గ్రేట్, దీనికి మీకు చాలా గౌరవం ఇవ్వాలి సంయుక్త' అంటూ కామెంట్ చేశాడు. ఈ ఫన్నీ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. అంతే కాదు ఆ కామెంట్ ని సినీ నటి సంయుక్త మీనన్ కూడా తన స్టోరీ లో యాడ్ చేసుకుని నవ్వుకుంది.
ఇకపోతే సంయుక్త మీనన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. సంయుక్త 1995 సెప్టెంబరు 11న కేరళ రాష్ట్రం, పాలక్కడ్‌లో జన్మించింది. ఆమె చిన్మయ విద్యాలయలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి, త్రిసూర్ లో ఎకనామిక్స్ లో డిగ్రీ పట్టా అందుకుంది. ఆమె 2016లో 'పాప్‌కార్న్' అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఈమె తమిళం, కన్నడ, తెలుగు భాషా చిత్రాల్లో నటించింది. సంయుక్త మీనన్ 2018లో 'కలరి' సినిమాతో తమిళ సినీరంగానికి పరిచయమైంది. తెలుగులో 2022లో విడుదలైన భీమ్లా నాయక్ మొదటి సినిమాగా రిలీజైంది. ఆమె 2022లో గాలిపట 2 సినిమాతో కన్నడ సినీ రంగంలోకి పరిచయమైంది.