సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన మరింత ముదురుతుంది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకుంది. మరోవైపు అల్లు అర్జున్‌ సైతం స్పందించడం కూడా ఈ వివాదం మరింత పెరగడానికి కారణమవుతుంది. శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపణలు, దీనికి బన్నీ ప్రెస్‌ మీట్‌ పెట్టి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడంతో వివాదం మరింత ముదరడానికి కారణమవుతుంది. మహిళ చనిపోయిందని పోలీసులు తనకు చెప్పలేదని, తన టీమ్‌ మాత్రం క్రౌడ్‌ పెరిగిందని మాత్రమే చెప్పారు, వెళ్లిపోవాలని వారు చెప్పడంతో తాను వెళ్లిపోయినట్టు తెలిపారు. తన క్యారెక్టర్‌ అస్సాసినేషన్‌ చేస్తున్నారని, తప్పుదోవ పట్టిస్తున్నారని అల్లు అర్జున్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా దీనికి పోలీసులు క్లారిటీ ఇచ్చారు. బన్నీకి కౌంటర్‌ ఇచ్చారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఏసీపీ రమేష్‌, సీఐ రాజు నాయక్‌లు ఆ రోజు జరిగిన ఘటన వివరించారు.

ఇదిలావుండగా ఈ కేసు విషయంలో ఇన్ని రోజులు చూస్తూ ఊరకున్నామని చెప్పారు. నిన్నటి ప్రెస్‌మీట్‌లో అల్లు అర్జున్‌ లో ఏమాత్రం పాశ్చాత్తాపం కనిపించలేదని, సక్సెస్‌ మీట్‌లకు వెళ్లలేదనే బాధ తప్ప ఇంకేం కనిపించడం లేదన్నారు.ఇదిలావుండగా చనిపోయిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్‌ఇచ్చేది లంచం అని, ఇలా చేస్తే అల్లు అర్జున్‌ బెయిల్‌ కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన కేసు మొత్తం క్లోజ్‌ కాలేదని, కేవలం మధ్యంతర బెయిల్‌ మాత్రమే వచ్చిందని, కేసుని తేల్చాల్సింది కోర్టు అని, జరిగింది యాక్సిడెంటా? కాదా అనేది తేల్చాల్సింది కోర్టు అని, చెప్పడానికి నువ్వు ఎవరు అని ఏసీపీ విష్ణుమూర్తి ప్రశ్నించారు. ఈ క్రమంలోనే రోజు రోజుకు అల్లు అర్జున్ కేసు కీలక మలుపులు తిరుగుతుంది. కాగా, తాజాగా అల్లు అర్జున్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. సంధ్య థియేటర్ ఘటనపై తాజాగా అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు స్టేషన్‌కు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు.అయితే, తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: