గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి టిడిపి కార్యకర్త ,ఎన్టీఆర్ అభిమాని అయినటువంటి మల్లికార్జున రెడ్డికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సైతం అండగా ఉంటానంటూ వెల్లడించారు.. ఇటీవలే నెల్లూరు పట్టణంలో మల్లికార్జున ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొనేవారట. ముఖ్యంగా నారా లోకేష్ కి సంబంధించి అన్ని కార్యక్రమాలను చేపడుతూ ప్రజలకు అండగా నిలిచేవారట. ఎన్టీఆర్ అభిమాని అయిన మల్లికార్జున రెడ్డి టిడిపి పార్టీ మొదటి నుంచి కార్యకర్తగా ఉన్నారట.



గత కొంతకాలంగా మల్లికార్జున్ రెడ్డి షూగర్ వ్యాధితో ఇబ్బంది పడుతూ ఉండడంతో ఏడాది క్రితమే పక్షవాతం కూడా సోకడంతో ఆయన పరిస్థితి చాలా విషమించిందని ప్రస్తుతం చికిత్స తీసుకొని కోలుకున్నట్లుగా ఈ విషయం అటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి తెలియడంతో దీంతో మల్లికార్జున రెడ్డికి నారా లోకేష్ నెల్లూరు నారాయణ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందించాలని వైద్యులను ఆదేశాలు జారీ చేశారట. అలాగే ఇన్ఫెక్షన్ కారణంగా ఒక కాలనీ సైతం తొలగించగా పక్షవాతం కారణంగా మరొక కాలుతో ఇబ్బంది పడుతున్నారట.


దీంతో మల్లికార్జున రెడ్డి పరిస్థితి చాలా దయనీయంగా ఉందని అక్కడ పార్టీ నాయకులు సోషల్ మీడియా ద్వారా నారా లోకేష్ కి తెలియజేశారట. అలా వెంటనే నారా లోకేష్ కూడా స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని పార్టీకి అన్న విధాలుగా మీలాంటి నాయకులు కావలని ఉద్దేశంతోనే.. నారా లోకేష్ తనకు అవసరమైన అన్ని వైద్య ఖర్చులను కూడా అన్ని విధాలుగా అండగా ఉంటాం అంటూ హామీ ఇచ్చారట. నారా లోకేష్ సూచనల మేరకే మంత్రి నారాయణ వీడియో కాల్ ద్వారా టిడిపి కార్యకర్త అయిన మల్లికార్జున్రెడ్డి యోగక్షేమాలను సైతం అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. త్వరలోనే నారా లోకేష్ స్వయంగా వచ్చి కలుస్తానని భరోసా ఇవ్వడంతో పాటుగా సహాయం కోరిన వెంటనే స్పందించడంతో నారా లోకేష్ ని ప్రతి ఒక్కరు కూడా ప్రశంశాలతో ముంచేత్తుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: