ఇప్పుడు తాజాగా గేమ్ ఛేంజర్ మూవీ టార్గెట్ ఎంత ఉంటుందనే విషయంపై ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగానె చర్చ కొనసాగుతోంది. శంకర్ సినిమా అంటేనే భారీ బడ్జెట్ సినిమా అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ముఖ్యంగా నటీనటుల రేమ్యునరేషన్ ప్రమోషన్స్ ఇలా అన్నీ కలుపుకొని గేమ్ చేంజర్ సినిమా బడ్జెట్ రూ.500 కోట్ల రూపాయలకు పైగా ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా రైట్స్ ని చిత్ర బృందం ఇప్పటికే ZEE కి సుమారుగా 200 కోట్లకు పైగా డీల్ కుదురుచుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అలాగే థియేటర్ రైట్స్ విషయానికి వస్తే 300 కోట్లకు పైగా రాబట్టాల్సి ఉన్నదట.. రెండు తెలుగు రాష్ట్రాలలో 120 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుందని ట్రెండ్ నిపుణులు తెలియజేస్తున్నారు.. అలాగే ఓవర్సీస్, కన్నడ, తమిళ్, నార్త్తులో కలిపి సుమారుగా 150 నుంచి 200 కోట్ల రూపాయల లోపు వసూలు చేయాల్సి ఉంటుందట. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఓకే అయినప్పటికీ బాలీవుడ్లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఏ విధంగా మెప్పిస్తుందో అంటూ అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. హిందీ మార్కెట్లో కలెక్షన్స్ రాబడితేనే సినిమాకి కలెక్షన్స్ భారీగా వస్తాయని అభిమానులు నమ్ముతున్నారు. మరి ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాకి హైప్ పెరుగుతుందేమో చూడాలి.