ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక సినిమా హిట్టవ్వాలంటే ఆ సినిమా మ్యూజిక్ అద్భుతంగా ఉండాలనే సంగతి తెలిసిందే. సినిమాలోని పాటలు హిట్టైతే మాత్రమే ప్రేక్షకులు సినిమాను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపిస్తారు. 2024 సంవత్సరానికి నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు అనిరుధ్ పేరు జవాబుగా వినిపిస్తోంది. అనిరుధ్ సినీ కెరీర్ లో ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే.
 
విక్రమ్, జైలర్ సినిమాల తర్వాత అనిరుధ్ కు భాషతో సంబంధం లేకుండా డిమాండ్ పెరిగింది. బెస్ట్ మ్యూజిక్ తో పాటు అదిరిపోయే బీజీఎం ఇచ్చే విషయంలో అనిరుధ్ కు ఎవరూ సాటిరారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. దేవర, వేట్టయన్ సినిమాలు ఈ ఏడాది అనిరుధ్ కు మంచి పేరును తెచ్చిపెట్టాయి.
 
అనిరుధ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉన్నా ఈ మ్యూజిక్ డైరెక్టర్ కు ఆఫర్ల విషయంలో మాత్రం కొదువ లేదనే చెప్పాలి. మరికొన్ని సంవత్సరాల పాటు సౌత్ లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అని ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అనిరుధ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.
 
దేవర2 సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమాకు సైతం అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగే ఛాన్స్ అయితే ఉంది. దేవర2 సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని అభిమానులు ఫీలవుతున్నారు. దేవర సీక్వెల్ ఇతర భాషల్లో సైతం హిట్ గా నిలిచి సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అనిరుధ్ వచ్చే ఏడాది కూడా క్రేజీ ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కెరీర్ పరంగా అనిరుధ్ మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: