- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .


పుష్ప 2 బెనిఫిట్ షో సంద‌ర్భంగా హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంథ్య థియేట‌ర్ ద‌గ్గ‌ర జ‌రిగిన గొడ‌వ త‌ర్వాత టాలీవుడ్ లో ఇష్యూ ర‌గులుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే బ‌న్నీ తో పాటు ద‌ర్శ‌కుడు సుకుమార్ కూడా టార్గెట్ అయిపోతున్నాడు. సినిమాలో ఐపీఎస్ అధికారి ఉన్న స్విమ్మింగ్ ఫూల్‌లో హీరో బ‌న్నీ మూత్రం పోసే సీన్‌ను ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే ద‌ర్శ‌కుడు సుకుమార్ కూడా శ్ర‌మ దోపిడీ దారుడే అంటూ ఇప్పుడు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.


ప్ర‌ముఖ ఫోక్ జాన‌ప‌ద సింగ‌ర్ గ‌ణ‌ప‌తి రావు దామోద‌ర సుకుమార్ గురించి ఓ విష‌యం బ‌య‌ట పెట్టారు. సుకుమార్ శ్ర‌మ దోపిడి దారుడు అని .. రంగ‌స్థ‌లం సినిమాలో అవకాశం ఇచ్చి .. ప‌ది రోజుల ప‌నికి రు. 30 వేలు అడిగితే .. నీకు అవ‌కాశం ఇవ్వ‌డ‌మే ఎక్కువ అన్న‌ట్టు మాట్లాడార‌ని కామెంట్ చేశారు. గ‌ణ‌ప‌తిరావు చేసిన కామెంట్ య‌ధావిథిగా ఇలా ఉంది.


బాగా చెప్పారు బ్రో.....
నా దగ్గర ఉన్న " ట్యూన్ " లు వాడుకోడానికి
ఈయన తరపున ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తో
రంగస్థలం కోసం ఫోన్ చేయించారు
ఈ దర్శక మహానుభావుడు...
10 రోజులు వర్క్ చేయాలంటే
నేను రు . 30 వేలు అడిగాను
పిలవటమే గొప్పంట, వాళ్ళు పిలిస్తే
ఇంకొకరు ఐతే యెగిరి గంతులు ఏస్తారంట ...
ఉచితంగా రావాలంట ....
రంగస్థలం " లో " బడ్జెట్ సినిమా అంట ....
నాకు నచ్చక ....నేను వెళ్ళ లేదు ...
మరల ఇంకో సారి ఫోన్ చేసి
హైదరాబాద్ లో ఎవరిదైనా మీ స్థాయిఉన్న
జానపద సింగర్ ఫోన్ నెంబర్ ఇమ్మని అడిగారు
నేను ఇచ్చాను ... సినిమా వాళ్లు కదా....
వాడుకున్నారు ... వదిలేసారు ....
పాపం అతను టీవీ లో చెప్పుకుని ఏడ్చాడు ....
ఛీ... వీళ్ళ బతుకు చెడ ....

మరింత సమాచారం తెలుసుకోండి: