నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో డాకు మహారాజ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి ఊర్వశి రౌటేలా , శ్రద్ధా శ్రీనాథ్ , ప్రగ్యా జైస్వాల్మూవీ లో హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి మొదటగా ది రేజ్ డాకు అంటూ సాగే మాస్ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసింది. ఇకపోతే ఈ సాంగ్ విషయంలో బాలయ్య అభిమానులు చాలా నిరుత్సాహ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ బాగానే ఉన్నప్పటికీ ఎందుకో ప్రేక్షకుల నుండి ఈ భారీ స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ఈ సాంగ్ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న కేవలం యూట్యూబ్ లో ఈ సాంగ్ కో 2.7 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి.

ఒక స్టార్ హీరో అయి ఉండి , భారీ అంచనాలు కలిగి ఉన్న సినిమా నుండి మొదటి పాట విడుదల అయిన ప్రేక్షకుల నుండి ఆ సాంగ్ కి భారీ రెస్పాన్స్ రాకపోవడం వల్ల ఈ సాంగ్ విషయంలో బాలయ్య అభిమానులు నిరుత్సాహ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే బాలయ్య తన తదుపరి మూవీ గా అఖండ మూవీ కి కొనసాగింపుగా అఖండ 2 అనే సినిమా చేయబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: