ప్రేక్షకుల అభిరుచి మారిపోవడంతో ప్రస్తుతం సినిమాలు తీయడం చాల కష్టంగా మారింది. ప్రేక్షకులు ఊహించని మలుపులతో సినిమా కథ ఉన్నప్పుడు మాత్రమే సగటు ప్రేక్షకుడు ఆసినిమాలను ఆదరిస్తున్న పరిస్థితులలో నేటి ఫిలిమ్ మేకింగ్ ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా సంస్థ ‘గరివిడి లక్ష్మీ’ మూవీని తీస్తున్నట్లుగా వచ్చిన ప్రకటన చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.



ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇప్పటికీ గరివిడి లక్ష్మీ గురించి కథలు కధలుగా ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. 1950-1960 ప్రాంతాల మధ్య పల్లెటూరి ప్రాంత వాసులకు హరికథ విద్వాంసురాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతం వారికి ఆమె సుపరిచితురాలు. ఆరోజులలో గరివిడి లక్ష్మీ హరికథ ఏదైనా చిన్న ఊరిలో ఉంది అని వార్త తెలిస్తే సాయంత్రం నుండి జనం ఆఊరుకు చేరుకుని గరివిడి లక్ష్మీ చెప్పే హరికథ కోసం చాల ఆశక్తిగా ఎదురు చూసే వారు అని అంటారు.



అప్పట్లో ఆమె చెప్పే హరికథలలో అడల్ట్ కంటెంట్ పదాలు ఎక్కువగా ఉండేవి కాబట్టి ఆమె హరికథ వినడానికి పల్లెటూరు జనం వేలల్లో వచ్చేవారని ఆప్రాంతానికి చెందిన ఆనాటి తరం వారు ఇప్పటికీ చెపుతూ ఉంటారు. ఇప్పుడు ఆమె పేరును సినిమా టైటిల్ గా మార్చి పీపుల్స్ మీడియా సంస్థ సినిమా తీయడం బట్టి ఆమె బయోపిక్ ను సినిమాగా తీస్తున్నారా లేదంటే ఆమె పేరును టైటిల్ గా పెట్టుకుని వేరే కథతో సినిమా తీస్తున్నారా అన్న విషయం పై ప్రస్తుతానికి క్లారిటీ లేదు.



ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక యంగ్ డైరెక్టర్ ఈమూవీని తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈమధ్య కాలంలో రొటీన్ సినిమాలను చూడకుండా ప్రేక్షకులు బయోపిక్ లను చూడటానికి బాగా ఆశక్తి కనపరుస్తున్నారు. ఈనాటి తరం ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం లేని ఒక ప్రముఖ వ్యక్తి జీవితాన్ని సినిమాగా తీస్తే అనేక సినిమాలు విజయవంతం అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కోవలోకి ఈమూవీ కూడ చేరితే మరొక సంచలనం అవుతుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: