ప్రజెంట్ జనాలు ఇదేవిధంగా ఆలోచిస్తున్నారు. బన్నీ అరెస్టుపై కొందరు హీరోలు స్పందిస్తున్నారు. మరి కొంతమంది హీరోలు మాత్రం స్పందించకుండా అలాగే ఉండిపోతున్నారు . అయితే కొందరు స్టార్స్ మాత్రం బన్నీ అంటే నెగిటీవ్ గా చూడడం ప్రారంభించారు . పుష్ప 2  సినిమాతో ఆయన రేంజ్ పూర్తిగా మారిపోయింది . అయితే పుష్ప సినిమాలో విలన్ గా నటించిన ఫహద్ ఫసిల్.. అరెస్టుపై స్పందించకపోవడం సంచలనంగా మారింది . అంత పెద్ద హీరో కి ఆ మాత్రం తెలియదా..? అంటూ మండిపడుతున్నారు.


మలయాళం ఇండస్ట్రీలో ఫహద్ ఫసిల్ పెద్ద హీరో. అయితే పుష్ప 2 సినిమాలో మాత్రం ఆయన్ని జోకర్ గా చేసి చూపించారు. అసలు పుష్ప2 ప్రమోషన్స్ లో కూడా ఆయన పాల్గొనలేదు . పుష్ప2 కి ఎలాంటి సపోర్ట్ చేయలేదు . అలాంటి ఆయన బన్నీ అరెస్టు అయితే కూడా స్పందించకపోవడం సంచలనంగా మారింది . అల్లు అర్జున్ పై ఈ హీరోకి కూసింత కోపం ఎక్కువగా ఉండింది అని .. పుష్ప సినిమా తర్వాత ఎటువంటి గుడ్ నేమ్ రాకపోవడం మైనస్ గా మారింది అని .. అందుకే అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించకుండా పరోక్షంగా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు అని జనాలు మాట్లాడుకుంటున్నారు.



అల్లు అర్జున్ కి సొంత ఇండస్ట్రీ నుంచి కూడా నెగెటివిటీ ఎదురవుతుంది అని అల్లు అర్జున్ ని ఆ దేవుడే కాపాడాలి అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అల్లు అర్జున్ గురించి వార్తలు వినిపిస్తూ ఉండడం హాట్ హాట్ గా టాపిక్ గా ట్రెండ్ అవుతూ ఉండడం సంచలనంగా మారింది . పుష్ప సినిమా 1600 కోట్లు కలెక్ట్ చేసింది. 2000 కోట్ల దిశగా దూసుకెళ్తుంది . కానీ అల్లు అర్జున్ కి ఆనందమే లేకుండా పోయింది. అల్లు అర్జున్ జీవితంలో పుష్ప 2 ఓ చెరగని మైల్ స్టోన్ ని క్రియేట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: