ఏ సినిమా అయినా సరే హిట్ అవ్వాలంటే స్టోరీ,స్క్రీన్ ప్లే,డైరెక్షన్, హీరో హీరోయిన్ తో పాటు అద్భుతమైన మ్యూజిక్ కూడా ఉండాలి. ఆ మ్యూజిక్ ఇవ్వాలంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎంత కష్టపడాలో చెప్పనక్కర్లేదు. ఒక్కో సినిమాకు ఒక్కో మ్యూజిక్ రెడీ చేయడం చాలా పెద్ద పని. అయితే ఒకప్పుడు ఎన్నో మెలోడీ సాంగ్స్ కి మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చేవారు.ఇప్పుడు మెలోడీ సాంగ్స్ తో పాటు ఐటం సాంగ్స్ ఊర మాస్ సాంగ్స్ వంటి ఎన్నో పాటలకి మ్యూజిక్ అందించాల్సి ఉంటుంది. ఒక సినిమాలో కచ్చితంగా ఒకటి రెండు అయినా ఐటమ్ సాంగ్ మాస్ సాంగ్ లు ఉంటున్నాయి. వాటికి తగ్గట్టు మ్యూజిక్ అందించడం చాలా పెద్ద పని.అయితే ఈ ఏడాది తమన్, డిఎస్పి వంటి మ్యూజిక్ డైరెక్టర్ లతో పాటు మరో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కూడా తన ప్రతిభ కనబరిచారు. 

ఇప్పటికే టాలీవుడ్ లో కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ల కొరత ఎక్కువగా ఉంది.తమన్ దేవిశ్రీ తర్వాత ఇలాంటి కమర్షియల్ మ్యూజిక్ ఇచ్చే డైరెక్టర్ ఎక్కువ కనిపించడం లేదు.అయితే తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మ్యూజిక్ బాగున్నప్పటికీ ఆయన ఫ్లేవర్ వేరు గా ఉంటుంది. అందుకే చాలా రోజుల నుండి తెలుగు దర్శకులు కన్నడ తమిళ మ్యూజిక్ డైరెక్టర్స్ ను పట్టుకున్నారు.కానీ ఇప్పుడు ఆ పని అక్కర్లేదు.ఎందుకంటే మన తెలుగులోనే ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ దూసుకొస్తున్నారు.ఆయన ఎవరంటే భీమ్స్ సిసిరోలి. తమన్ దేవిశ్రీల స్థానాన్ని టాలీవుడ్ లో రీప్లేస్ చేసే ఒకే ఒక్కడు భీమ్స్ సిసిరోలి. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలకు మ్యూజిక్ ఇవ్వాలంటే దేవి శ్రీ లేదా తమన్ అనేలా మారిపోయింది. కానీ ఇప్పుడు బీమ్స్ సిసిరోలి పేరు కూడా పాపులర్ అవ్వడంతో ఆయన్ని కూడా చాలామంది పెద్ద దర్శకులు హీరోలు తీసుకుంటున్నారు.

ఇక ఈయన 2022 లో  రవితేజ హీరోగా చేసిన ధమాకా సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందించారు. కమర్షియల్ సినిమాలకు భీమ్స్  సిసిరోలి బెస్ట్ ఆప్షన్ గా తెలుగు దర్శకులకు దొరికారు. ధమాకా సినిమాతో అద్భుతమైన మ్యూజిక్ అందించి ఈ ఒక్క సినిమాతోనే మాస్ పల్స్ తనకి బాగా తెలుసు అన్నట్లుగా పేరు తెచ్చుకున్నారు. ఇక  ఆ తర్వాత వచ్చిన మ్యాడ్ మూవీ కూడా మ్యూజిక్ పరంగా మంచి పేరు తెచ్చుకుంది. దీంతో బీమ్స్ సిసిరోలి ఖాతాలో వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి. అలా ఓ నాలుగు చిన్న సినిమాలు రెండు పెద్ద సినిమాల లో ఈయనకు అవకాశాలు వచ్చాయి. ఇక సంక్రాంతికి విడుదల కాబోతున్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్గా బీనమ్స్ సిసిరోలి చేశారు. ఈ సినిమాలోని గోదారి గట్టుమీద రామచిలకవే అనే పాట ప్రస్తుతం యూత్ తో పాటు ప్రతి ఒక్కరిని ఒక ఊపు ఊపేస్తోంది. 

ఇప్పటికే ఈ పాటపై ఎంతోమంది షార్ట్స్ రీల్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయితే కనుక భీమ్స్ సిసిరోలిపై నిర్మాతలకు మంచి అభిప్రాయం కలుగుతుంది. తమన్ దేవిశ్రీల లాగా మంచి అవుట్ ఫుట్ ఇవ్వగలరనే నమ్మకం వాళ్లలో పెరుగుతుంది. ఇక వెంకీ సంక్రాంతికి వస్తున్నాం మూవీ హిట్ అయితే సీనియర్ హీరోలైన రవితేజ, చిరంజీవి, వెంకటేష్,నాగార్జున,బాలయ్య వంటి సినిమాలకు బెస్ట్ ఆప్షన్ గా ఉంటారు. వీళ్ళేకాకుండా డెకాయిట్,గాంజా శంకర్ వంటి సినిమాలు హిట్ అయితే మిడిల్ రేంజ్ హీరోలకి కూడా భీమ్స్ సిసిరోలే మ్యూజిక్ ఇవ్వగలరు. మొత్తానికి తమన్,దేవిశ్రీల తర్వాత టాలీవుడ్ కి ఒక బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ రూపంలో దొరికినట్టే అర్థం చేసుకోవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: