- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .


సంథ్య థియేట‌ర్ ద‌గ్గ‌ర ప్రీమియ‌ర్ షో ఘ‌ట‌న త‌ర్వాత చాలా విష‌యాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. తెలుగు మెయిన్ మీడియా తో పాటు సోష‌ల్ మీడియా లో కొన్ని ల‌క్ష‌ల కామెంట్లు పుట్టుకు వ‌స్తున్నాయి. కొంద‌రు బ‌న్నీ కి .. పుష్ప 2 సినిమాకు అనుకూలం గా కామెంట్లు పెడుతుంటే .. మ‌రి కొంద‌రు మాత్రం బ‌న్నీకి యాంటీ గా ఎక్కువుగా కామెంట్లు పెడుతున్నారు. దీనికి తోడు బ‌న్నీ కి అటు మెగా ఫ్యామిలీ తో నిన్న మొన్న‌టి వ‌ర‌కు కాస్త గ్యాప్ ఉంద‌న్న ప్ర‌చారం నేప‌థ్యంలో బ‌న్నీ ని సినిమాల ప‌రంగాను.. అటు మెగా భి మానుల‌తో పాటు ఇటు జ‌న‌సేన కేడ‌ర్ కూడా గ‌ట్టిగా టార్గెట్ చేస్తోంది. అయితే సోష‌ల్ మీడియాలో వైసీపీ వాళ్లు బ‌న్నీ కి... పుష్ప 2 సినిమా కు గ‌ట్టిగా స‌పోర్ట్ చేస్తున్నారు.


ఇక సోష‌ల్ మీడియా లో కొన్ని వేల కామెంట్లు ఆశ్చ‌ర్య క‌రంగా క‌నిపిస్తున్నాయి. ఫేస్‌బుక్ .. అటు ట్విట్ట‌ర్ .. ఇన్ స్టా ఖాతా లు ఓపెన్ చేస్తే చాలు .. ఇదే సంఘ‌ట‌న పై ర‌క‌రకాల కామెంట్లు ఉంటున్నాయి. కామెంట్ల వ‌ర్షం కుర‌వ‌డంతో పాటు ఎద్ద ఎత్తున చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి. ఈ క్ర‌మంలో నే ఓ నెటిజ‌న్ అయితే చ‌నిపోయిన రేవతి కుటుంబానికి రు. 25 కోట్లు బ‌న్నీ ఇవ్వాల‌న్న డిమాండ్ తెర‌మీద‌కు తెచ్చాడు. మ‌రీ ఆశ్చ‌ర్య క‌రంగా పుష్ప 2 హీరోయిన్ ర‌ష్మిక‌ను రేవ‌తి భ‌ర్త‌కు ఇచ్చి పెళ్లి చేయాల‌ట‌. విన‌డానికే షాకింగ్ గా ఉన్నా ఇది నిజం. ఈ ఒక్క కామెంట్ మాత్ర‌మే కాదు.. ఇలాంటి కామెంట్లు ఎన్నో సోష‌ల్ మీడియా లో స‌ర‌దాగా నో .. సీరియ‌స్ గానో క‌నిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: