మన తెలుగు చిత్ర సీమ పరిశ్రమలో ఒకప్పుడు ఎంతో మంది ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్లు ఉండేవారు.కానీ ప్రస్తుతం వాళ్ళందరూ ఫేడ్ అవుట్ అయిపోయారు. ఇక ఇప్పుడు తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్లు అంటే అందరికీ ఎక్కువగా గుర్తుకు వచ్చే పేరు తమన్,దేవిశ్రీ లు మాత్రమే. అయితే ఇప్పుడు కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు పుట్టుకొస్తున్నప్పటికీ పాన్ ఇండియా సినిమాలు అంటే దేవిశ్రీ తమన్ లే గుర్తుకు వస్తారు. గతంలో మణిశర్మ, రాజ్ కోటి వంటి ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఎన్నో మెలోడీ సాంగ్స్ కి అద్భుతమైన మ్యూజిక్ అందించారు.. అయితే ప్రస్తుతం తెలుగులో ఉన్న దర్శకులలో చేతి నిండా సినిమాలతో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఆయన తమన్ మాత్రమే. 

ఈయన చేతిలో ప్రస్తుతం గేమ్ చేంజర్, ఓజి, ది రాజా సాబ్  వంటి పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. అలాగే రీసెంట్గా విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పుష్ప-2 సినిమాకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా తమన్ అందించారు. అలాగే ఈ ఏడాది మొదట్లో విడుదలైన గుంటూరు కారం సినిమాకి తమన్ మ్యూజిక్ అద్భుతంగా అందించారు.ఈ సినిమాలో కుర్చీ మడత పెట్టి అనే పాట ఈ ఏడాది మొత్తం వైరల్ అయింది.అలాగే ఈ సినిమాలతో పాటు అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాకి కూడా తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్గా ఫిక్స్ చేసి పెట్టుకున్నారట.

 అలాగే బాలీవుడ్ లో వరుణ్ ధావన్,కీర్తి సురేష్ కాంబోలో వస్తున్న బేబీ జాన్ మూవీకి కూడా తమన్ మ్యూజిక్ అందించారు. ఇవే కాకుండా రెండు మూడు చిన్న సినిమాలకు కూడా తమన్ మ్యూజిక్ అందించారు.అలాగే భారీ అంచనాలతో రాబోతున్న పవన్ కళ్యాణ్ ఓజి మూవీకి భారీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని తమన్ అందిస్తున్నట్టు తెలుస్తోంది.ఇలా ఈ ఏడాది తమన్ చాలా బిజీబిజీగా గడపారు. ఇక పుష్ప టు సినిమాకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించడం కోసం నిర్మాతలు తమన్ ని తీసుకోవడంతో దేవిశ్రీ ఒకింత అసహనానికి గురయ్యారనే విషయం మనకు తెలిసిందే

మరింత సమాచారం తెలుసుకోండి: