సంధ్య థియేటర్ వివాదం .. హీరో అల్లు అర్జున్ డిఫెన్స్ .. పోలీసుల వివరణ అన్ని కలిసి రాజకీయ రంగు పులుము కున్నట్టు క్లారిటీగా కనిపిస్తోంది. అసలు ఈ వ్యవహారంలో ముందుగా ఎంటర్ అయిన రాజకీయ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి ఇప్పుడు సైలెంట్ అయ్యింది. తాము స్పందించడం వల్ల అల్లు అర్జున్ కు ఇబ్బంది కలిగిందే తప్ప .. తమకు కలిసి వచ్చేది లేదని ఆ పార్టీ పెద్దలు గ్రహించారు. ఇలాంటి టైంలో కాంగ్రెస్తో పాటు .. ఎంఐఎం కూడా గొంతు కలిపి బన్నీ వ్యతిరేకంగా వెళ్లాయి. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగి అల్లు అర్జున్ కు మద్దతుగా ఆ పార్టీ నేతలు మాట్లాడటం మొదలు పెట్టేశారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బిజెపి అన్న పంతాని కి దారితీస్తోంది. పోలీసులు బన్నీ బెయిల్ క్యాన్సిల్ చేయించే దిశగా పావులు కదుపుతున్నారు.
ఇందుకోసం మొత్తం సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీశారు .. మీడియా ముందు పెట్టారు. ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కే అవకాశం క్లారిటీగా కనిపిస్తోంది. ఇలాంటి టైంలో బన్నీకి అండగా ఉండేది బిజెపి మాత్రమే .. మెగా హీరో పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఏపీలో బిజెపి కూటమి లో ఉన్నారు. ఆ పార్టీకి గట్టి మద్దతు దారు గా ఉన్నారు. జనసేన పార్టీ పెట్టిన దాన్ని మొదటి నుంచి బిజెపి కి అండగాని ఉంచుతున్నారు. ఒక 2019 ఎన్నికల్లో మాత్రమే పవన్ బిజెపితో విభేదించారు. ఇప్పుడు మాత్రం వీర విధేయుడుగా ఉన్నారు. తెలంగాణలో బిజెపికి బలమైన మాస్ జనాల అట్రాక్షన్ లేదు. ఇలాంటి టైంలో బన్నీని తమ వైపునకు తిప్పుకుంటే తమకు చాలా ప్లస్ అవుతుంది అన్న లెక్కలు బిజెపి వేస్తున్నట్టు కనిపిస్తోంది.