- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .


హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో పుష్ప 2 సినిమా రిలీజ్ కు ముందు రోజు వేసిన స్పెషల్ ప్రీమియర్ షో కు హీరో అల్లు అర్జున్ రావటం ... అక్కడ తొక్కిసులాటలో రేవతి అని మహిళా మృతి చెందిన తర్వాత ఈ వ్యవహారం చినుకు చినుకు గాలి వానగా మారుతుంది. సంధ్య థియేటర్ వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో హీరో బన్నీపై నిప్పులు చెరగటం .. ఆ వెంటనే అదే రోజు సాయంత్రం బన్నీ ప్రెస్ మీట్ పెట్టి అదంతా ఫాల్స్ అని చెప్పటం చకచక జరిగిపోయాయి. ఈ వ్యవహారం ఇక్కడితో ఆగలేదు. మంత్రులు .. పోలీసులు అధికారులు రంగంలోకి దిగిపోయారు .. హెచ్చరికలు తీవ్రంగా ఉన్నాయి. ఇదంతా కలిసి ఇండస్ట్రీ మీద ప్రభావం చూపించేలా కనిపిస్తోంది .. ఇప్పుడు మిగిలింది. ఇండస్ట్రీ అటు తెలంగాణ ప్రభుత్వం మధ్య సంధి చేయడం ఒకటి మాత్రమే.


అయితే అటు ఇటు మాట్లాడగలవాళ్ళు కావాలి. బన్నీ వైపు నుంచి ఇక కౌంటర్లు ఎలాగూ ఉండవు .. కానీ ప్రభుత్వం వైపు నుంచి సంధి కుదర్చాలి. ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవాలి లేదంటే భవిష్యత్తులో టాలీవుడ్ కు కష్టం సంక్రాంతి సినిమాలు ఉన్నాయి. థియేటర్లో రన్ కావాలి ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ జరగాలంటే ప్రభుత్వ ఆగ్రహం చల్లార్చాలి .. ఇలాంటి పనిచేయాలంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వల్ల మాత్రమే అవుతుంది. సురేష్ బాబు - అశ్విని దత్ - మెగాస్టార్ లాంటి పెద్దలు రంగంలోకి దిగాల్సి ఉంది. ఈ వ్యవహారం ఇక కోర్టుకు వదిలేసేలా ఒప్పించాల్సి ఉంటుంది. కానీ ఈ పనికి పూనుకోవటానికి మెగాస్టార్ ముందుకు రావాలి. నిన్న మొన్నటివరకు బన్నీ మెగా ఫ్యామిలీ వేరు ... అల్లు ఫ్యామిలీ వేరు అన్న పంథాలో ముందుకు వెళ్లారు. అల్లు ఆర్మీ ఏర్పాటు చేసుకొని ఎదురేలేదన్నట్టుగా వ్యవహరించినట్టు ఆయన బిహేవియర్ కనిపించింది .ఇప్పుడు అలాంటి మేనమామ చిరంజీవి బన్నీకి దిక్కు అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: