రాజకీయాలంటే ఒకరి అభిప్రాయాలతో పని లేకుండా .. వారికి ఎంత నష్టం చేస్తున్నామో తెలుసుకోకుండా
తమ పార్టీ కోసం వాడేసుకుంటున్నారు. వైసీపీ సినిమా పరిశ్రమలో వివాదాలో లేదా ఏ హీరో మీద అయినా కాంట్రవర్సీ ఉంటే తమ స్వలాభం కోసం వాడుకునే ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ వాళ్లు నిన్న మొన్నటి వరకు జూనియర్ ఎన్టీఆర్ ను అలా వాడేశారు .. ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు వైసీపీ లో ఉండడంతో ఆ కార్డు తో ఎన్టీఆర్ కు నందమూరి ఫ్యామిలీ వార్ లో డైరెక్టు గానే సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ సంగతి చూస్తున్నారు .. ఎందుకంటే మెగా ఫ్యామిలీ లో కాస్తో కూస్తో కోల్డ్ వార్ నడుస్తోంది.
దీనిని క్యాష్ చేసుకునేందుకు ఇప్పుడు అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తున్నట్టు నాటకం మొదలు పెట్టేసి బన్నీ ని వాడేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ ను వైసీపీ నేతలు ఎలా వాడారో తెలిసిందే. చంద్రబాబు ర్యాలీల్లో ఓ పది మంది వైసీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లు పట్టుకొని వచ్చి హడావిడి చేయడం .. వెంటనే టీవీ 9 - ఎన్టీవీ బ్రేకింగులు వేయడం మొదలు అయిపోతాయి. వైసీపీ వాళ్లు జగన్ - ఎన్టీఆర్ ఫ్లెక్సీ లు వేసుకుని ఎంత హడావిడి చేయాలో అంతా చేస్తూ వచ్చారు.
ఇక ఇప్పుడు వీరంతా అల్లు అర్జున్ మీద పడ్డారు. జగన్ పుట్టిన రోజు జరుపుకుంటే.. ఆయన ఒక్కడికి ఫ్లెక్సీలు పెట్టడం మాత్రమే కాదు .. ఆ ఫ్లెక్సీ లలో అల్లు అర్జున్ ను కలుపుకున్నారు. ఇప్పుడు వివాదంలో వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. ఇక ఇలాంటి రాజకీయ పార్టీ ల ట్రాప్ లో హీరోల అభిమానులు పడి పోయి వారు మరింత గా రెచ్చిపోతోన్న పరిస్థితి.