బాలీవుడ్లో నటిస్తున్న బేబీ జాన్ సినిమా కాకుండా కీర్తి సురేష్ చేతిలో రివాల్వర్ రిటా, కన్నెవెది అనే రెండు చిత్రాలు ఉన్నాయట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగులు పూర్తి అయినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత కొత్త సినిమాలకు కీర్తి సురేష్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఇక మీదట తాను సినిమాలలో నటించకూడదని నిర్ణయం కూడా తీసుకున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వివాహం తర్వాత కీర్తి సురేష్ ఎక్కువ సమయాన్ని తన భర్తతో గడపాలని అందుకే సినిమాలకు దూరంగా ఉండాలనే ఆలోచనలతో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే కీర్తి సురేష్ కొన్ని నెలలు గ్యాప్ తీసుకొని రీఎంట్రీ ఇస్తుందా లేకపోతే పూర్తిగా సినిమాలకు దూరమవుతుందా అనే విషయం మాత్రం తెలియడం లేదు.. కానీ కీర్తి సురేష్ సినిమాలకు దూరం అవుతుందని విషయం అభిమానులకు తెలియగానే అభిమానులు హర్ట్ అవుతున్నామని కామెంట్స్ చేస్తున్నారు.. ముఖ్యంగా చాలామంది హీరోయిన్స్ వివాహమైన తర్వాత కూడా ఒకవైపు కుటుంబంతో మరొకవైపు సినిమాలలో నటిస్తూ ఉన్నారు అంటూ కీర్తి సురేష్ కి సలహా ఇస్తూ ఉన్నారు. మరి కీర్తి సురేష్ మీద వస్తున్న ఈ రూమర్స్ పైన ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి.