సినిమా వాళ్లను బెదిరించడం చాలా ఈజీ అనుకుంటున్నారో ఏమో గాని ఇప్పుడు ఈ విషయం బాగా చర్చకు వస్తోంది. సినిమా వాళ్లు అంటే దేవుల్లు కాదు... వాళ్లు మన లాంటి మనుష్యులే .. అని ప్రజలు గుర్తిస్తున్నారు. తప్పు అన్నది ఎవరు చేసినా తప్పే అవుతోంది. అయితే ఇప్పుడు సినిమా వాళ్ల బలహీనతల తో పాటు వాళ్లు తప్పులు ఆసరగా చేసుకుని వారిని బెదిరించడం .. వాళ్లను మీడియా లో లోకువ చేసి ఓ ఆటాడు కోవడం బాగా జరుగుతోంది. ఇదంతా చూస్తే సినిమా వాళ్లు పాపం అని జాలిపడక తప్పని పరిస్థితి.
ఇక సీనియర్ హీరో .. కలెక్షన్ కింగ్ మోహన్ బాబును రాచి రంపాన్ని పెట్టిన మీడియా .. ఆయనకు బోనస్‌గా హత్యాయత్నం కేసు కూడా నమోదు అయ్యేలా చేసింది. మోహన్ బాబు ఇంట్లో ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి .. అయితే అది సినిమా ఫ్యామిలీ కాబట్టి కాస్త మసాలా దించి కొట్టేశారు. బాగా హైలెట్ అయ్యింది. ఆ టైంలో ఆయన ఇంట్లోకి వెళ్లి .. అది కూడా ర్యాష్ గా దూసుకు వెళ్లి ముందు మైక్ పడితే ఎవరికి అయినా కోపం రాదా ? సహజంగానే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తూ .. ఆయన పరారీలో ఉన్నారని వార్తలు వేస్తున్నారు.
ఇక పుష్ప 2 సినిమా గురించి ఇప్పుడెవరూ మాట్లాడుకోవడం లేదు. అంతా అల్లు అర్జున్ బిహేవియర్ .. ఆయనదే తప్పన్నట్టు గా వెళుతోంది. అసలు బన్నీ ని ఓ రేంజ్‌లో ఆటాడేసుకుంటున్నారు. ఎన్టీఆర్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఫ్యాన్ ఫ్యామిలీ అన్న వివాదం ముందుకు వచ్చింది. తిరుపతిలోని ఓ యువకుడు తాను ఎన్టీఆర్ అభిమానని చావు బతుకుల్లో ఉన్నానని చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. అతడు దేవర చూసి చచ్చిపోతానని ఎమోషనల్ అయితే.. ఎన్టీఆర్ వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పారు. ఫ్యాన్స్ తో పాటు టీటీడీ ద్వారా రు. 55 లక్షల సాయం అందింది. అయితే ఆ బాలుడి తల్లి ఎన్టీఆర్ నుంచి ఎలాంటి సాయం లేదని చెపుతోన్న వీడియో వైరల్ అవుతోంది. ఇలా సినిమా వాళ్లను బ్లాక్ మెయిల్ చేయడం.. బెదిరింపులకు దిగడం ఇప్పుడు సోషల్ మీడియా.. మీడియాలో బాగా హైలెట్ అవుతోంది.